TS TET | టీఎస్ టెట్ హాల్ టికెట్లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..

TS TET | టీఎస్ టెట్ 2024 హాల్ టికెట్లు గురువారం సాయంత్రం 6 గంట‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. నిన్న‌టి నుంచి టెట్ హాల్ టికెట్ల కోసం ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే.

TS TET | టీఎస్ టెట్ హాల్ టికెట్లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..

TS TET | హైద‌రాబాద్ : టీఎస్ టెట్ 2024 హాల్ టికెట్లు గురువారం సాయంత్రం 6 గంట‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. నిన్న‌టి నుంచి టెట్ హాల్ టికెట్ల కోసం ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. టెట్ హాల్ టికెట్ల‌ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే జ‌ర్న‌ల్ నంబ‌ర్, పుట్టిన తేదీ(టెన్త్ మెమో) త‌ప్ప‌నిస‌రి. ఈ రెండు లేక‌పోతే హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవ‌డం అసాధ్యం.హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం tstet2024.aptonline.in/tstet ఈ వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వండి.

ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌లు(టెట్) ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వ‌హించ‌నున్నారు. పేప‌ర్ 1 ప‌రీక్ష‌ను ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, పేప‌ర్ 2ను మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. టెట్ ప‌రీక్ష‌ల‌న్నీ ఆన్‌లైన్ విధానంలోనే నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు. ఈఏడాది టెట్‌ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్‌ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు.