నేడు టీఎస్ టెట్ హాల్ టికెట్లు విడుద‌ల‌.. డౌన్ లోడ్ చేసుకోండి ఇలా..

టీఎస్ టెట్( TS TET ) 2024కు సంబంధించిన హాల్ టికెట్ల‌ను స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ గురువారం విడుద‌ల చేయ‌నుంది. ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌లు(టెట్) ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వ‌హించ‌నున్నారు.

  • Publish Date - May 16, 2024 / 07:38 AM IST

హైద‌రాబాద్ : టీఎస్ టెట్( TS TET ) 2024కు సంబంధించిన హాల్ టికెట్ల‌ను స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ గురువారం విడుద‌ల చేయ‌నుంది. ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌లు(టెట్) ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వ‌హించ‌నున్నారు. పేప‌ర్ 1 ప‌రీక్ష‌ను ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, పేప‌ర్ 2ను మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. టెట్ ప‌రీక్ష‌ల‌న్నీ ఆన్‌లైన్ విధానంలోనే నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు.

హాల్ టికెట్ డౌన్ లోడ్ ఇలా..

  • మొద‌ట‌గా టీఎస్ టెట్ వెబ్‌సైట్‌(tstet.cgg.gov.in.)ను లాగిన్ అవ్వాలి.
  • హోం పేజీలో ఉండే టీఎస్ టెట్ హాల్ టికెట్ 2024 లింక్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాలి.
  • క్యాండిడేట్ ఐడీ, పుట్టిన తేదీతో పాటు ద‌ర‌ఖాస్తులో రిజిస్ట్రేష‌న్ చేసుకున్న మొబైల్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి.
  • అనంత‌రం స‌బ్‌మిట్ చేసి హాల్ టికెట్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే..

మే 20 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్1)
మే 20 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్2)
మే 21 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్1)
మే 21 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్2)
మే 22 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్1)
మే 22 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్2)

మే 24 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ – ఎస్1)
మే 24 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్2)

మే 28 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్1)
మే 28 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్2)

మే 29 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్1)
మే 29 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్2)

మే 30 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్1)
మే 30 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్2)
మే 31 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్1)
మే 31 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్2)
జూన్ 1 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ – ఎస్1)
జూన్ 1 – పేప‌ర్ 1(మైన‌ర్ మీడియం) (సెష‌న్ – ఎస్2)
జూన్ 2 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్1)
జూన్ 2 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్2)

Latest News