TG Weather Update | తెలంగాణకు రెండురోజులు వర్ష సూచన.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

TG Weather Update | తెలంగాణల రాగల రెండురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఈ మేరకు వాతావరణశాఖ కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. బంగాళాఖాతంలోని ఉత్తర ఒడిశాకు తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది.

TG Weather Update | తెలంగాణకు రెండురోజులు వర్ష సూచన.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

TG Weather Update | తెలంగాణల రాగల రెండురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఈ మేరకు వాతావరణశాఖ కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. బంగాళాఖాతంలోని ఉత్తర ఒడిశాకు తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో బలమైన ఉపరితల గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.

కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడుతాయని.. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. గత 24 గంటల్లో నిర్మల్‌, జగిత్యాల, పెద్దపల్లి, హన్మకొండ, ములుగు, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.