ముషీరాబాద్ బీజేపీ ఇంచార్జీగా వేణుమాధవ్

ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జీగా నెమలికొండ వేణుమాధవ్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఈ నియామకాన్ని వెల్లడించారు

ముషీరాబాద్ బీజేపీ ఇంచార్జీగా వేణుమాధవ్

విధాత : ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జీగా నెమలికొండ వేణుమాధవ్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఈ నియామకాన్ని వెల్లడించారు. సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేటకు చెందిన నెమలికొండ వేణుమాధవ్ గతంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జీగా, బండి సంజయ్ నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్రలో రాష్ట్ర మీడియా కమిటీ సభ్యునిగా, పలు ఉప ఎన్నికల్లో ఇంచార్జీగా పని చేశారు. ఆర్ఎస్ఎస్ కుటుంబ నేపధ్యం ఉన్న వేణుమాధవ్ ఏబీవీపీలో, హిందు వాహినిలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. మెదక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. 10 సంవత్సరాలకు పైగా జర్నలిస్టుగా పనిచేశారు. ఉన్నత విద్యావంతునిగా, క్రియాశీల కార్యకర్తగా వేణుమాధవ్ పేరు తెచ్చుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ ప్రభారీ గా తనను నియామకం చేసినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్, ఇతర రాష్ట్ర నాయకులకు వేణుమాధవ్‌ ధన్యవాదాలు తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.