Kishan Reddy | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల.. జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డికి ప్రమోషన్‌..!

Kishan Reddy | తెలంగాణలో కాంగ్రెస్‌తో సమానంగా 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర కేబినెట్‌ కూర్పులో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అందులో భాగంగా రెడ్డి లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి కేంద్ర కేబినెట్‌ పదవితోపాటు.. ఒక మహిళ, ఒక బీసీ నేతకు కేంద్ర సహాయ మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని అంటున్నారు.

Kishan Reddy | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల.. జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డికి ప్రమోషన్‌..!

Kishan Reddy : తెలంగాణలో కాంగ్రెస్‌తో సమానంగా 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర కేబినెట్‌ కూర్పులో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అందులో భాగంగా రెడ్డి లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి కేంద్ర కేబినెట్‌ పదవితోపాటు.. ఒక మహిళ, ఒక బీసీ నేతకు కేంద్ర సహాయ మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇప్పటిదాకా కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డికి మరోసారి కేబినెట్‌ హోదా లభించే అవకాశాలున్నాయని టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు ఆయనను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా నియమించే అవకాశాలున్నాయనే చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు జాతీయ స్థాయిలో అధ్యక్ష మార్పు జరగకపోయినా ముందుగా కిషన్‌రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకొని 6 నెలలు లేదా ఏడాది తర్వాత జాతీయ అధ్యక్షుడిని చేయవచ్చని బీజేపీ వర్గాలు చర్చిస్తున్నాయి.

గురువారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటానని చెప్పడం ఈ చర్చకు ఊతమిస్తోంది. ఓసీ మహిళా కోటాలో డీకే అరుణకు, పార్టీ విధేయుడిగా రెండోసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కి, రాష్ట్రంలో దాదాపు పాతికేళ్లుగా రాజకీయవేత్తగా, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌కు కేంద్రంలో మంత్రి పదవులు దక్కుతాయని ఊహాగానాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో పేరున్న ఈటల రాజేందర్‌ను కేంద్రమంత్రిగా కాకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందనే చర్చ కూడా సాగుతోంది.