Harish Rao : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వరుసగా అవినితీ అరోపణలు చేస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు సోమవారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరుగుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

harish rao

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వరుసగా అవినితీ అరోపణలు చేస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు( Harish Rao) సోమవారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల(Construction of Young India Integrated Schools)  నిర్మాణంలో భారీ కుంభకోణం(Big  Scam)  జరుగుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన హరీష్ రావు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో జరుగుతున్న భారీ కుంభకోణం జరుగుతుందంటూ కీలక అంశాలు వెల్లడించారు.

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో భారీ అవినీతి జరుగుతోందని, కాంట్రాక్టర్లు ఆర్గనైజ్డ్ రింగ్ గా అయ్యి పనులను పంచుకుంటున్నారు అని హరీశ్ రావు ఆరోపించారు. 76 స్కూళ్లకు సంబంధించిన ప్రతి టెండర్‌కు ఎక్సెస్‌ ధర కోట్ చేసి దక్కించుకున్నారు అని, టెండర్లలో కనిష్టంగా 4.59% నుంచి గరిష్టంగా 4.96% ఎక్సెస్‌తో, నిబంధనల ప్రకారం 5% దాటకుండా పక్కా ప్లాన్‌తో కొల్లగొట్టారు అని వెల్లడించారు. ఒక్కో స్కూలుకు రూ. 250 కోట్లు కేటాయించగా, అందులో సివిల్ వర్క్స్ కోసమే సుమారు రూ. 150 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు అని విమర్శించారు. 76 స్కూళ్లకు సంబంధించి ప్రభుత్వ అంచనా వ్యయం రూ. 10,199.54 కోట్లు కాగా, కాంట్రాక్టర్లు దాన్ని రూ. 10,693.55 కోట్ల ఎక్సెస్‌తో దక్కించుకున్నారు అని తెలిపారు. అంటే కేవలం ఈ టెండర్ల ద్వారా సుమారు రూ. 494 కోట్లు ప్రజాధనాన్ని అదనంగా దోచిపెడుతున్నారు అని ఆరోపించారు.

మంత్రుల నియోజవర్గ స్కూళ్లకు ఎక్సెస్ టెండర్లు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ తో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలో అత్యధికంగా 4.95% ఎక్సెస్ ధరకు టెండర్లు కేటాయించడం పలు అనుమానాలకు కలిగిస్తున్నాయని హరీశ్ రావు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో 4.95 ఎక్సెస్ టెండర్ వేశారని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో 4.95% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారు అని, మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం హుస్నాబాద్‌లో 4.95% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారు అని, మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గం కొల్లాపూర్‌లో 4.77% ఎక్సెస్‌కు టెండర్, మంత్రి కొండా సురేఖ నియోజకవర్గం వరంగల్ ఈస్ట్‌లో 4.99% ఎక్సెస్‌కు టెండర్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గం నల్గొండలో 4.87% ఎక్సెస్‌కు టెండర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గం ఖమ్మంలో 4.95% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారు అని ఆరోపించారు. అలాగే మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగులో 4.95% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారని, మంత్రి దామోదర రాజనర్సింహ నియోజకవర్గం ఆందోల్‌లో 4.99% ఎక్సెస్‌కు టెండర్ ఇవ్వగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గం వికారాబాద్‌లో 4.80% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారు అని, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియోజకవర్గం మంథనిలో 4.89% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారు అని ఆరోపించారు.

మంత్రుల నియోజకవర్గాల్లోనే ఎక్కువ ధరకు టెండర్లు ఖరారు కావడం ఈ కుంభకోణానికి నిదర్శనం అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో జరిగిన ఈ వందల కోట్ల టెండర్ల కుంభకోణంపై శాసనసభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం అని, నా దగ్గర ఈ స్కామ్‌కు సంబంధించి ఇంకా పూర్తి ఆధారాలు, వివరాలు ఉన్నాయని, వాటన్నింటినీ అసెంబ్లీ సమావేశాల్లో సభ సాక్షిగా బయటపెట్టబోతున్నట్లుగా హరీశ్ రావు ప్రకటించారు.

సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న వాహనం కేఎల్ఎస్ఆర్ కంపెనీ పేరు మీదనే ఉంటుందని, ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంతో పాటు ఏకంగా 9 స్కూళ్ల టెండర్లను ఈ ప్రభుత్వం అదే కేఎల్ఎస్ఆర్ సంస్థకు కట్టబెట్టిందని హరీశ్ రావు కీలక ఆరోపణలు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పూర్తి చేయగా, అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న 26 నియోజకవర్గాలకు ఇవ్వలేదు అన్నారు. కక్షపూరితంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఈ స్కూళ్లు మంజూరు చేయలేదు అని, అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, అలాగే కొందరు బీజేపీ ఎమ్మెల్యేలకు మాత్రం స్కూళ్లు కేటాయించారు అని హరీశ్ రావు పేర్కొన్నారు.

కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఏనాడూ రాజకీయ పక్షపాతం చూపలేదు అని, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సమానంగా ప్రాధాన్యత ఇచ్చారు అని గుర్తు చేశారు. మిషన్ కాకతీయ మొదటి దశ నుంచే, మిషన్ భగీరథ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఇలా ఏ పథకమైనా 119 నియోజకవర్గాలకు సమానంగా ఇచ్చారు అని వెల్లడించారు. మెడికల్ కాలేజీలను అన్ని జిల్లాలకు ఇస్తూ, నేటి కాంగ్రెస్ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గానికి కూడా ఇచ్చాం అని గుర్తు చేశారు. దళితబంధు లాంటి గొప్ప పథకాన్ని ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిర, చింతకాని నుంచే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఘనత కేసీఆర్ కే సొంతం అన్నారు. అభివృద్ధిని సమానంగా చూసిన బీఆర్ఎస్ ఎక్కడ? కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారన్న అక్కసుతో 26 నియోజకవర్గాలకు స్కూళ్లను ఆపేసిన మీరెక్కడ? అని రేవంత్ రెడ్డి తీరుపై హరీశ్ రావు మండిపడ్డారు.

Latest News