CM Revanth Reddy | అక్రమ నిర్మాణదారులు ఎంతవారైనా వదిలేదే లేదు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అక్రమనిర్మాణాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. చెరువుల కబ్జాలు, అక్రమ కట్టడాలకు కారకులైనవారు ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు

హైదరాబాద్: అక్రమ కట్టడాల కూల్చివేతపై, ముఖ్యంగా సినీనటుడు నాగార్జున(Nagarjua) ఫంక్షన్ హాల్ ఎన్–కన్వెన్షన్(N Convention)ను హైడ్రా కూల్చివేసిన తర్వాత రాష్ట్రంలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వ విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. చెరువులను కబ్జా చేసి, నిర్మాణాలు(FTL illegal constructors) చేపట్టిన వారు, అక్రమ కట్టడాలను నిర్మించినవారు సమాజంలో ఎంత పెద్దవారైనా, ప్రభుత్వంలో ఎంత పలుకుబడి(Highly influential) ఉన్నా, ఆఖరికి ప్రభుత్వంలో భాగస్వాములైనా వదిలిపెట్టేది లేదని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.
తాము శ్రీకృష్ణుడు గీతలో (Bagawadgeetha)చెప్పినట్లు చెరువులను కాపాడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలే తనకు స్ఫూర్తి అని తెలిపారు. హరేకృష్ణ(Hare Krishna) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై మాట్లాడారు.
చెరువులను కబ్జాచేసిన వాళ్ల నుంచి విముక్తి చేయాలనుకున్నాం. తమపై ఎంత ఒత్తిడి ఉన్నా, వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నాం. చెరువులు ఆక్రమించిన వారిని ఎంతవారైనా ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదు. ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుందన్నదానికి చెన్నై, వయనాడ్(Vayanad floods) వరదల విలయమే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నా, ఆఖరికి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా ఒకే ఫలితం. కొందరు ధనవంతులు తమ విలాసాల కోసం చెరువుల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు. వాటి నుంచి వచ్చే డ్రైనేజీ నీరు చెరువుల్లో కలుపుతున్నారు. దాంతో చెరువులన్నీ విషతుల్యమై జీవవైవిధ్యం దెబ్బతింటోందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాల కోరల నుండి, కబ్జాకోరులనుండి హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని ముఖ్యమంత్రి అన్నారు.
Tags: