రూ. 3.90 పైస‌ల‌కు యూనిట్ విద్యుత్‌ను కొన్నాం.. స్ప‌ష్టం చేసిన కేసీఆర్

విద్యుత్ కొనుగోలు విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అర్థం లేని ఆరోప‌ణ‌లు చేస్తుంద‌ని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో యూనిట్ విద్యుత్‌ను రూ. 3.90 పైస‌ల‌కు కొన్నామ‌ని తేల్చిచెప్పారు. యూనిట్ విద్యుత్‌ను రూ. 13కు కొన్న‌ట్లు కాంగ్రెస్ ప్ర‌భుత్వం దుష్ప్ర‌చారం చేస్తోంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు.

రూ. 3.90 పైస‌ల‌కు యూనిట్ విద్యుత్‌ను కొన్నాం.. స్ప‌ష్టం చేసిన కేసీఆర్

విద్యుత్ కొనుగోలు విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అర్థం లేని ఆరోప‌ణ‌లు చేస్తుంద‌ని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో యూనిట్ విద్యుత్‌ను రూ. 3.90 పైస‌ల‌కు కొన్నామ‌ని తేల్చిచెప్పారు. యూనిట్ విద్యుత్‌ను రూ. 13కు కొన్న‌ట్లు కాంగ్రెస్ ప్ర‌భుత్వం దుష్ప్ర‌చారం చేస్తోంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు.

రాష్ట్రం ఏర్ప‌డ్డాక పెద్ద ఛాలెంజ్ విద్యుత్ స‌మ‌స్య‌. క‌రెంట్ విష‌యంలో వెకిలీ ప్ర‌య‌త్నం చేస్తున్నారు కాంగ్రెసోళ్లు. తెలంగాణ ఏర్ప‌డినప్పుడు అంటే 2014లో విద్యుత్ కొర‌త 2,700 మెగ‌వాట్లు. దాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని.. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం 2014 కంటే ముందు ఎంత వినియోగం జ‌రిగింద‌ని లెక్క‌లు తీశారు. ప‌దేండ్ల వ‌ర‌కు ఏపీకి అందుబాటులో ఉన్న ప‌వ‌ర్‌లో 53.89 శాతం తెలంగాణ‌కు, 46.11 శాతం ఏపీకి ఇవ్వాల‌ని, ప‌దేండ్ల‌ త‌ర్వాత స‌ర్దుబాటు చేసుకోవాల‌ని చ‌ట్టంలో ఉంది. ఈ చ‌ట్టాన్ని రాజ్యాంగం సాక్షిగా నాటి ఆంధ్రా గ‌వ‌ర్న‌మెంట్ ఉల్లంఘించింది. రెండోది బీజేపీ ప్ర‌భుత్వం ఏడు మండ‌లాల‌ను ఏపీకి ఇవ్వ‌డ‌మే కాకుండా మా కోటాలో వ‌చ్చిన సీలేరు ప్రాజెక్టును వారికి ఇచ్చారు. దీనిపై పోరాటం చేస్తే కేంద్రం ప‌ట్టించుకోలేదు అని కేసీఆర్ తెలిపారు.

రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు 2,700 మెగావాట్ల షార్టెజీ ఉంది. మాకు కేటాయించిన 2400 మెగావాట్లు ఏపీ ఇవ్వ‌దు. మాకొచ్చిన సీలేరును లాగేసుకుంటారు. నాటి సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి తెలంగాణ అంధ‌కారం అవుతుంద‌ని అన్నాడు.. అదొక ఛాలెంజ్. రాష్ట్రంగా నిల‌దొక్కుకోవాలి. క‌రెంట్ ఇవ్వాల‌ని నేటి సీఎం నాడు అసెంబ్లీలో గోల‌. ఇంకా త‌మాషా ఏంటంటే విద్యుత్ కొనాలి. కొనాలంటే ఎలా.. ఈ రాష్ట్రంలో నేష‌న‌ల్ గ్రిడ్‌లో లేదు. ఎక్క‌డ్నుంచి అంటే అక్క‌డ్నుంచి కొన‌డానికి వీల్లేదు. తెలంగాణ‌కు నేష‌న‌ల్ గ్రిడ్‌లో ఇమిడియ‌ట్‌గా రావాలంటే ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఇండియా లిమిటెడ్ ఉంట‌ది. ఛార్జ్ తీసుకొని విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తుంది. వార్ధా – డిచ్‌ప‌ల్లి, అంగుల్ – ప‌లాస, వ‌రంగ‌ల్ – వ‌రురా ఈ మూడు లైన్లు క‌లిపితే కానీ నేష‌న‌ల్ గ్రిడ్‌లో రాం అని చెప్పి, చాలా మంది కుయుక్తులు పన్నుతున్నార‌ని చెప్పి.. నిల‌దొక్కుకోవాల‌ని, ప‌వ‌ర్ సెక్టార్‌లో విజ‌యం సాధించాల‌ని, ఛాలెంజ్‌గా తీసుకొని ప్ర‌య‌త్నించి విద్యుత్ స‌మ‌స్య‌ను అధిగ‌మించాం అని కేసీఆర్ తెలిపారు.

జూన్‌లో ప‌వ‌ర్‌లోకి వ‌స్తే.. అగ్రిక‌ల్చ‌ర్‌కు మిన‌హాయించి అదే ఏడాది సెప్టెంబ‌ర్ చివ‌రి నాటికి అంద‌రికి 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చాం. అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అతి భ‌యంక‌రంగా ఉన్న క‌రెంట్ వ్య‌వ‌స్థ‌ను స‌రి చేసి, భ‌విష్య‌త్‌కు ప్ర‌ణాళిక‌లు ర‌చించి, కొత్త ప‌వ‌ర్ ప్లాంట్ల‌కు శ్రీకారం చుట్టాం. ఈ బాకా కాకా మీడియా చానెల్స్, అమ్ముడుపోయిన యూట్యూబ్ చానెల్స్ త‌ప్పుడు ప్ర‌చారం చేశాయి. యూనిట్ విద్యుత్‌ను రూ. 13కు కొన్నార‌ని ప్ర‌చారం చేశారు. కానీ నిజానికి 3 రూపాయాల 90 పైస‌ల‌కు కొన్నాం. రూ. 13కు ఎందుకు కొంటాం..?. అజ్ఞానుల‌కు తెలియ‌క‌పోతే ఏం చేయలేం అని కేసీఆర్ తెలిపారు.