అసిఫాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై కేసు నమోదు .. ఖండించిన కేటీఆర్

హుజురాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీస్ కేసు నమోదైన క్రమంలో అసిఫాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై కూడా పోలీసు కేసులు నమోదవ్వడం హాట్ టాపిక్‌గా మారింది

అసిఫాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై కేసు నమోదు .. ఖండించిన కేటీఆర్

విధాత, హైదరాబాద్ : హుజురాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీస్ కేసు నమోదైన క్రమంలో అసిఫాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై కూడా పోలీసు కేసులు నమోదవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. కుమ్రంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు విశ్వ‌ప్ర‌సాద్ రావు, బీఆరెస్‌ ఎమ్మెల్యే కోవా ల‌క్ష్మీ మ‌ధ్య చోటుచేసుకున్న వివాదంలో ఇరువర్గాల ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి. ఈ వివాదంలో విశ్వ‌ప్ర‌సాద్ రావు చేసిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కోవా ల‌క్ష్మీపై పోలీసులు 296(బీ), 351(2) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆరెస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం ఏకపక్షంగా కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు.నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని కేటీఆర్ తెలిపారు.