Anasuya | అనసూయ ఇటీవలి కాలంలో చాలా హాట్ టాపిక్ అవుతుంది. నెటిజన్స్‌కి మంచి స్టఫ్ ఇస్తూ ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. యాంకరింగ్ నుండి తప్పుకొని నటిగా సినిమాలతో బిజీ అవుతున్న సమయంలో లేనిపోని వివాదాలలోకి దూరి చెడ్డపేరు తెచ్చుకుంటుంది. మొన్నటివరకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స తో పెద్ద ఎత్తున యుద్ధమే చేసింది. కాగా తాజాగా ఈ అమ్మడు బోరున ఏడుస్తూ తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అలానే ఒక ఇంట్రెస్టింగ్ […]
Anasuya |
అనసూయ ఇటీవలి కాలంలో చాలా హాట్ టాపిక్ అవుతుంది. నెటిజన్స్‌కి మంచి స్టఫ్ ఇస్తూ ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. యాంకరింగ్ నుండి తప్పుకొని నటిగా సినిమాలతో బిజీ అవుతున్న సమయంలో లేనిపోని వివాదాలలోకి దూరి చెడ్డపేరు తెచ్చుకుంటుంది. మొన్నటివరకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స తో పెద్ద ఎత్తున యుద్ధమే చేసింది.
కాగా తాజాగా ఈ అమ్మడు బోరున ఏడుస్తూ తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అలానే ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడంతో అది చర్చనీయాంశంగా మారింది. అనసూయ ఎందుకు ఇలా ఏడుస్తుంది, ఆమె జీవితంలో వచ్చిన కష్టాలేంటన అందరు ఆలోచన చేస్తున్నారు.
అయితే అనసూయ తన పోస్ట్‌లో.. ప్రపంచంలోని ఎంత గొప్పవాళ్లకైన, మాములు మనుషులకైన బాధలు సహజం. జీవితం అన్నాక కష్టాలు వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కోక తప్పదు. అయితే మన బాధని వ్యక్తం చేసేలా గట్టిగా ఏడవడంలో ఏ మాత్రం తప్పులేదు.
ఫుల్‌గా ఏడ్చేసి, ఆ తర్వాత మనలోని బాధని అంతా బయటకు పంపి, తిరిగి సాధారణ పరిస్థితికి కావాలి. బాధని వదిలేసేందుకు ఏడవడంలో ఎలాంటి తప్పు లేదని చెబుతుంది అనసూయ. జీవితంలో బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయని ఏ మాత్రం అధైర్యపడవద్దని కూడా చెప్పుకొచ్చింది. నా పోస్ట్‌ని చూసిన వారు ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు. ప్రతి ఒక్కరం కూడా రిలేషన్ పెంచుకోవాలి.
ఒకరికొకరం అండగా నిలవాలి. సమాచార విషయాలని షేర్ చేసుకోవాలి. జీవనశైలి, సంస్కృతులను తప్పక అనుభవించాలి. నా పోస్ట్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే అన్ని ఫోటో షూట్లు, పోజులు, క్యాండీడ్స్, చిరునవ్వులు, డాన్సులు, బలమైన కౌంటర్లు, పునరాగమనాలు ఇవన్నీ కూడా నా జీవితంలో భాగం. అందుకే ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను.
#AnasuyaBharadwaj shares an emotional note and breaksdown on how as a celebrity she’s facing backlash on social media!!