బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం

బెంగాల్ తొలి విడత, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం

విధాత : పశ్చిమ బెంగాల్ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో పాటు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి, పశ్చిమ బెంగాల్‌లో తొలి విడతలోని 152 స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. రెండో విడతలో భాగంగా బెంగాల్ లోని 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. తొలి విడతలో బెంగాల్ లో 1478 అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

తమిళనాడులో 23న జరిగే పోలింగ్ లో 234 నియోజకవర్గాల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తమిళనాడులో అధికార డీఎంకే కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష అన్నాడీఎంకే బీజేపీ కూటమి, నటుడు విజయ్ కి చెందిన టీవీకే మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. విజయ పార్టీతో గెలుపు ఒటములపై అంచనాలు క్లిష్టంగా మారాయి. పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ సారధ్యంలోని టీఎంసీకి, బీజేపీకి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 9న కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి.తమిళనాడులో 23న, పశ్చిమ బెంగాల్ లో 23, 29న రెండు విడతలుగా పోలింగ్ జరుగనుంది. మే 4న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవి కూడా చదవండి :

కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె…డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ