Aamani | ఆ రోజు.. నా భర్తకి ఎలా కమిటయ్యానో తెలియదు: ఆమని

Aamani | విధాత: “పొరుగింటి మంగళ గౌరి.. వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్నిగారి,, కాసులపేరు చూడు” అంటూ సగటు గృహిణి భర్తను అడిగే కోర్కెలతో గృహలక్ష్ములందరికీ కనెక్ట్ అయిపోయింది ఆమని. ఈ సినిమా వచ్చి చాలాకాలం అయినా, ఆమని సినిమాలకు బ్రేక్ ఇచ్చి పెళ్ళి చేసుకుని వెళ్లిపోయినా సరే.. ఆమె చేసిన ‘మిస్టర్ పెళ్ళాం’, ‘శుభలగ్నం’, ‘శుభ సంకల్పం’ సినిమాలు ఇంకా గుర్తుండి పోయాయంటే ఆమని సహజమైన నటనే దానికి కారణం. తన సినీ కెరీర్‌ని […]

  • Publish Date - August 17, 2023 / 03:50 AM IST

Aamani |

విధాత: “పొరుగింటి మంగళ గౌరి.. వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్నిగారి,, కాసులపేరు చూడు” అంటూ సగటు గృహిణి భర్తను అడిగే కోర్కెలతో గృహలక్ష్ములందరికీ కనెక్ట్ అయిపోయింది ఆమని. ఈ సినిమా వచ్చి చాలాకాలం అయినా, ఆమని సినిమాలకు బ్రేక్ ఇచ్చి పెళ్ళి చేసుకుని వెళ్లిపోయినా సరే.. ఆమె చేసిన ‘మిస్టర్ పెళ్ళాం’, ‘శుభలగ్నం’, ‘శుభ సంకల్పం’ సినిమాలు ఇంకా గుర్తుండి పోయాయంటే ఆమని సహజమైన నటనే దానికి కారణం. తన సినీ కెరీర్‌ని తమిళ నాట ప్రారంభించినా టాలీవుడ్‌లోనే ఆమని మంచి నటిగా గుర్తుంపు తెచ్చుకుంది.

నరేష్ సరసన ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన ‘జంబలకిడి పంబ’ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. దీనికన్నా గృహిణి పాత్రలకు ఆమని సరిగ్గా నప్పేస్తుంది. ఈ కోవలో ఆమె చేసిన ప్రతి పాత్ర ఫ్యామిలీ ఆడియన్స్‌కి విపరీతంగా కనెక్ట్ అయిపోయాయి.

గ్లామర్ పాత్రలకన్నా ఫ్యామిలీ పాత్రల్లోనే సరిగ్గా ఒదిగిపోయింది ఆమని. ఈ కోవలో తను చేసిన సినిమాలన్నీ మంచి నటిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే కెరియర్ మంచి జోరుగా ఉన్నప్పుడే పెళ్ళి వైపు అడుగులేసింది ఆమని. ఓ బిజినెస్‌మ్యాన్‌ని ప్రేమించి పెళ్ళాడింది. అతని కోరిక మేరకు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

పెళ్ళితో వచ్చిన బాధ్యతలతో బిజీగా మారిపోయి, ఇకపై సినిమాలు చేయకూడదంటే.. చేయనంటూ భర్తకు మాట ఇచ్చేసిందట. కానీ అప్పుడు అలా ఎలా మాట ఇచ్చానో అని ఇప్పుడు అనిపిస్తుందట. ప్రేమ వివాహం తరువాత కుటుంబ బాధ్యతలతో బిజీగా మారిపోయిన ఆమని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

నటనకు తను దూరం కావడం అనేది అంత తేలిక కాదని, పెళ్ళయిన కొత్తలో నా భర్త ఇకపై సినిమాలు చేయవద్దంటే సరే అనేశాను కానీ.. ఇప్పుడు ఆ మాట తలుచుకున్న ప్రతీసారి.. నిజంగా నేనేనా? అప్పుడలా అంది అని అనిపిస్తుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఆమని. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆమని దూసుకెళుతోంది. ఇప్పుడొస్తున్న చాలా సినిమాల్లో అమ్మ, అత్త వంటి పాత్రలలో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే.

Latest News