Bharat Gaurav | రేపు సికింద్రాబాద్‌ నుంచి భారత్‌ గౌరవ్‌ రైలు.. ‘అయోధ్య-కాశీ’కి ప్రయాణం..!

Bharat Gaurav | భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దేఖో అప్నా దేశ్‌’లో భాగంగా దేశంలోని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారత్‌ గౌరవ్‌ రైళ్లను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా రైల్వేశాఖ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లను నడుపుతున్నది.

Bharat Gaurav | రేపు సికింద్రాబాద్‌ నుంచి భారత్‌ గౌరవ్‌ రైలు.. ‘అయోధ్య-కాశీ’కి ప్రయాణం..!

Bharat Gaurav | భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దేఖో అప్నా దేశ్‌’లో భాగంగా దేశంలోని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారత్‌ గౌరవ్‌ రైళ్లను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా రైల్వేశాఖ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లను నడుపుతున్నది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. ‘అయోధ్య-కాశి’ పుణ్యక్షేత్ర పేరుతో ప్యాకేజీని ప్రకటించి. భారత్‌ గౌరవ్‌ రైలులో ప్రయాణం కొనసాగనున్నది. సికింద్రాబాద్‌ నుంచి గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించేందుకు అవకాశం ఉన్నది. ఈ నెల 9 నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలై.. తొమ్మిదిరోజుల పాటు కొనసాగనున్నది.

విశేషమేమిటంటే.. ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట (వరంగల్), ఖమ్మం , ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట్, విశాఖపట్నం (పెందుర్తి), విజయనగరం , టిట్లాగఢ్‌లలో ప్రయాణిలకు సైతం ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ప్యాకేజీలో ప్రయాణం ఈ నెల 9న సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలవుతుంది. మూడోరోజు గయా రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది. నాలుగో రోజు ఉదయం అల్పాహారం పూర్తి చేసుకొని బనారస్‌ వెళ్తారు. అక్కడే రాత్రి బస చేస్తారు. ఐదోరోజు కాశీ విశ్వనాథ, అన్నపూర్ణాదేవి ఆలయాలను దర్శించడంతో పాటు సాయంత్రం గంగాహారతిలో పాల్గొంటారు.

ఉదయం ఏడుగంటలకు రైల్వేస్టేషన్‌కు చేరుకొని అయోధ్యకు బయలుదేరుతారు. ఆరో రోజు రామజన్మభూమి, హనుమాన్‌గర్హి, సరయూ రివర్‌, అయోధ్య ధామ్‌ను దర్శించి.. ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరుతారు. ఏడోరోజు ప్రయాగ్‌రాజ్‌ సంగమ్‌ చేరుకొని తివ్రేణి సంగమానికి వెళ్తారు. తిరిగి కట్ని, బిలాస్‌పూర్‌, రాయ్‌పూర్‌ మీదుగా తిరిగి ప్రయాణమవుతారు. తొమ్మిదవ రోజున 11.30గంటలకు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. ప్యాకేజీలో మూడు రకాల కేటగిరిలో అందుబాటులో ఉన్నాయి. ఎకనామి కేటగిరిలో స్లీపర్‌, స్టాండర్డ్‌ క్లాస్‌లో థర్డ్‌ ఏసీ, కంఫర్ట్‌ క్లాస్‌లో సెకండ్‌ ఏసీలో ప్రయాణం ఉంటుంది. ఎకానమీ క్లాస్‌లో ప్యాకేజీ రూ.15,100.. స్టాండర్డ్‌ కేటగిరిలో రూ.24,300.. కంఫర్ట్‌ ప్యాకేజీ ధర రూ.31,500 అందుబాటులో ఉన్నది. పిల్లలకు ధర చెల్లించాల్సి ఉంటుంది. వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ని సంప్రదించాలని.. 040-27702407, 9701360701, 9281495845, 9281495843, 8287932228, 8287932229 నంబ్లలో సంప్రదించాలని సూచించింది.