Snake in PM residence | ప్రధాని మోదీ నివాసంలో నాగుపాము కలకలం.. ఎలుకను వెంబడిస్తూ వచ్చిందన్న అధికారులు..!

Snake in PM residence | ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఓ నాగుపాము దూరింది. ఇది గమనించిన ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది వైల్డ్‌లైఫ్ SOS కు సమాచారం అందించారు. దాంతో అక్కడకు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది ప్రధానమంత్రి నివాసంలో దూరిన ఆ పామును పట్టుకున్నారు.

Snake in PM residence | ప్రధాని మోదీ నివాసంలో నాగుపాము కలకలం.. ఎలుకను వెంబడిస్తూ వచ్చిందన్న అధికారులు..!

Snake in PM residence : వర్షాలు పడుతుండటంతో భూమి లోపల వేడిని తట్టుకోలేక కలుగుల్లోని పాములు బయటికి వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పాముల సంచారానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఎమర్జెన్సీ రెస్క్యూ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు అనేక కాల్స్ వస్తున్నాయి. ఆ పాములను వైల్డ్‌లైఫ్ SOS బృందాలు రక్షించి అటవీ ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఓ నాగుపాము దూరింది. ఇది గమనించిన ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది వైల్డ్‌లైఫ్ SOS కు సమాచారం అందించారు. దాంతో అక్కడకు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది ప్రధానమంత్రి నివాసంలో దూరిన ఆ పామును పట్టుకున్నారు. మూడు అడుగుల పొడవున్న ఆ నాగుపామును చాకచక్యంగా పట్టేశారు.

అనంతరం ఆ పాముకు పూర్తి వైద్య పరీక్షల చేశారు. ఆ తర్వాత పామును తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలారు. ఆ పాము ఆహారం కోసం అన్వేషిస్తూ ప్రధాని నివాసం దిశగా వచ్చి ఉంటుందని, అక్కడ ఎలుక కనిపించడంతో దాన్ని వెంబడిస్తూ నివాసంలోకి వచ్చిందని, సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం అధికారులు వెల్లడించారు.