సూర్యాపేట: వినాయక నిమజ్జనంలో అపశృతి

విధాత, నల్గొండ: సూర్యాపేట వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం కోటి నాయక్ తండాలో శుక్రవారం ఎస్సార్ఎస్పీ కాలువలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా సూర్య, నాగు అనే ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు వారి కోసం కేనాల్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు తండ్రి కొడుకు లని స్థానికుల సమాచారం.

సూర్యాపేట: వినాయక నిమజ్జనంలో అపశృతి

విధాత, నల్గొండ: సూర్యాపేట వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం కోటి నాయక్ తండాలో శుక్రవారం ఎస్సార్ఎస్పీ కాలువలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా సూర్య, నాగు అనే ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.

స్థానికులు, పోలీసులు వారి కోసం కేనాల్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు తండ్రి కొడుకు లని స్థానికుల సమాచారం.