CM Revanth Reddy| కేంద్ర రైల్వే మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

విధాత, హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రెండవ రోజు గురువారం కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కేంద్రమంత్రితో చర్చించారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పలువురు ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
రీజనల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి బృందం ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాదు నుంచి బందర్ వరకు రైల్వే కనెక్టివిటీ కల్పించాలని కోరారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే అంశాలపై వారు కేంద్ర మంత్రితో చర్చించారు.