విధాత : పురాణా పురుషుడు భగవద్గీత ప్రబోధకుడు దేవదేవుడు శ్రీ కృష్ణుడు పాలించిన ద్వారకా నగరం ఉనికి గుజరాత్ లోని సముద్రంలో శాస్త్రవేత్తల పరిశోధనలలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. సముద్రంలో శ్రీకృష్ణుడి ద్వారకా నగరం వెలుగులోకి రావడంతో భూమిపై శ్రీకృష్ణుడి గాథపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచింది. సముద్ర గర్బంలో మునిగిపోయిన ద్వారకా పట్టణం గూర్చి ఏ కొత్త విషయాలు వెలుగు చూసిన సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది. ఇదే క్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం సముద్ర గర్బంలోని ద్వారకలోని శ్రీకృష్ణుడి విగ్రహాన్ని సందర్శించి పూజలు చేయడం ద్వారక పట్టణంపై మరింత ఆసక్తి రేపింది.
ఇది ఇలా ఉంటే తాజాగా గుజరాత్ తీరంలో ద్వారకా నగరం సముద్ర ప్రాంతంలో శ్రీకృష్ణుడు ధరించే నెమలి ఫించంతో కూడిన అరుదైన చేపల సంచారం వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. నెమలి ఈక వంటి తోకలను కల్గి ఉన్న చేపలను చూసిన నెటిజన్లు నమో శ్రీకృష్ణ అంటూ ఆశ్చర్యం, అనందాల మధ్య భక్తిపారవశ్యం వ్యక్తపరుస్తున్నారు.
సుమారు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ద్వారక గురించి గుజరాత్ తీరంలో ఏఎస్‌ఐ, మెరైన్ ఆర్కాలజీ పరిశోధనలు జరుగుతున్నాయి. 1983-86లో గుజరాత్ సముద్రతీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయం బయటపడింది. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సముద్ర గర్భంలో నీటి అడుగున 3-6 మీటర్ల లోతులో పురాతన ద్వారాక నగర గోడలు, పిల్లర్లు, ఓడరేవు ఆధారాలు కనుగొన్నారు. క్రీ.పూ. 3102-3150కి చెందినవిగా కార్బన్ డేటింగ్ ధృవీకరించింది. శ్రీకృష్ణుడు నిర్మించిన ఈ స్వర్ణ నగర శిథిలాలు ఇక్కడ సముద్ర గర్భంలో దాగి ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
భారతదేశంలోని ముఖ్యమైన తీర్థ స్థలాల్లో ద్వారక ఒకటి. మహాభారత కథలో ఇది శ్రీకృష్ణుడి సామ్రాజ్యంగా వెలుగొందింది. కృష్ణుడి మరణం తరువాత అరేబియా మహా సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు. “భగవాన్ శ్రీకృష్ణుడు ఈ నగరంలో వందేళ్లు జీవించాడు. గోమతి నది ఒడ్డున 84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న రాజ్యమిది. ఇక్కడే గోమతి నది అరేబియా మహా సముద్రంలో కలుస్తుంది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు విశ్వకర్మ సహాయంతో సముద్రం నుండి 12 యోజనాల భూమిని తీసుకొని ఈ నగరాన్ని నిర్మించాడని కథనం. ఇది గుజరాత్ లోని ప్రస్తుత ద్వారకాధీష్ ఆలయం (జగత్ మందిర్) సమీపంలో, గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట, ఓఖామాండల్ తీరంలో ఉంది. ఇది సముద్రం అడుగున ఉన్న 7 ప్రాచీన నగరాలలో (సప్త పురి) ఒకటిగా విశ్వసించబడుతుంది.
భగవాన్ శ్రీకృష్ణుడి అవతారం పరిసమాప్తం అనంతరం సముద్రం ద్వారకను తనలో కలిపేసుకుంది. మహాభారతం మూడవ అధ్యాయంలో దీని గురించి ప్రస్తావించారు. ద్వారకాపురి క్రీ.పూ. 1443లో సాగర గర్భంలో మునిపోయినట్లు చెబుతారు. తీరం వెంట దీని ఆనవాళ్లు లభించాయి. ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్ సముద్రతీరంలో ద్వారకకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ద్వారకాధీశుడి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి. దీన్ని శ్రీకృష్ణుడి మనవడు వజ్రనాభుడు నిర్మించాడని ప్రతీతి. ప్రస్తుతం సముద్ర గర్బంలోని ప్రాచీన నగరాన్ని భక్తులు, పర్యాటకులు వీక్షించేందుకు గుజరాత్ ప్రభుత్వం జలాంతర్గామి ప్రయాణ ప్యాకేజీలను ప్రవేశపెట్టడం విశేషం.
Fish with Peacock Feather like tail spotted at Dwarka 🦚 pic.twitter.com/ixMGkaMmbW
— Heritage Girl (@HeritageGirl7) February 22, 2026
ఇవి కూడా చదవండి :
Heartwarming Friendship : దోస్త్ తోడుగా ఎంఆర్ఐ స్కాన్ మిషన్ లోకి..వైరల్ ఘటన !
VIROSH | ఉదయ్‌పుర్‌లో ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’… పెళ్లి తేదీ అఫీషియల్‌గా ప్రకటించిన విజయ్ – రష్మిక
