Python Pole Dance | ఒసే వయ్యారీ పాము.. తిప్పుకొంటూ చెట్టెక్కేసిందిగా..
కొండచిలువలు అతిపెద్ద పాము జాతుల్లో ఒకటి. వాటి కండరాలకు వాటి ప్రత్యేక పొలుసులు పట్టు అందించడం ద్వారా సులువుగా చెట్లు ఎక్కేస్తాయి. ఆ ఎక్కడం కూడా వయ్యారాలు ఒలికించినట్టు చూడటానికి సరదాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవడానికి కూడా ఈ వయ్యారం, తిప్పుడు కారణంగా మారింది.

Python Pole Dance | పాములు పాకుతూ కదులును! ఇదీ మనం చిన్నప్పుడు చదువుకున్నది. అయితే.. ఆ పాకుడు ఒక్కో దగ్గర ఒక్కో విధంగా ఉంటుంది. నేల మీద తిన్నగా పాకుతూ పోయే పాములు ఉంటాయి. కొన్ని వంకర్లు తిరుగుతూ పోతాయి. కొండచిలువలు నేల మీద ఎలాంటి వంకరలు లేకుండా పాకినా.. చెట్లు ఎక్కేటప్పుడు ఒక టెక్నిక్ పాటిస్తాయి. దానినే కాన్సెర్టినా లోకోమోషన్ అని పిలుస్తారు. అడవుల్లో చెట్లు ఎక్కేటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించడం ద్వారా సులభంగా పైకి చేరుకుంటాయి. అక్కడ దొరికే ఏ చిన్న జీవినో గుటుక్కమనిపిస్తుంటాయి.
ఆ కళను ప్రదర్శించిన ఒక కొండ చిలువ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ పద్ధతిలో కొండ చిలువ తన శరీరాన్ని ఒక క్రమపద్ధతిలో చెట్టుకు సగం సగం చుట్టుకుంటూ ఆ ఆధారంతో సులువుగా పైకి పాకుతుంది. పాముకు ఇతర అవయవాలు ఏమీ లేకపోయినా ఈ పద్దతే అవి తమ శరీరాన్ని ముందుకు కదిలించేందుకు, చెట్లు ఎక్కేందుకు దోహదం చేస్తుంది. కొండచిలువలు అతిపెద్ద పాము జాతుల్లో ఒకటి. వాటి కండరాలకు వాటి ప్రత్యేక పొలుసులు పట్టు అందించడం ద్వారా సులువుగా చెట్లు ఎక్కేస్తాయి. ఆ ఎక్కడం కూడా వయ్యారాలు ఒలికించినట్టు చూడటానికి సరదాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవడానికి కూడా ఈ వయ్యారం, తిప్పుడు కారణంగా మారింది. వేగంగా, చాకచక్యంగా, అదే సమయంలో నవ్వు కలిగించేలా పాము చెట్టు ఎక్కడాన్ని చూసిన నెటిజన్లు తలో విధంగా స్పందించారు. పోల్ డ్యాన్స్ చేస్తున్న పాము అని కొందరు అభివర్ణించారు.
పాము జాతుల్లో నూటికి 80 శాతం వరకూ విష రహితాలే. చెట్లపై ఉండే పక్షులు, కొన్ని రకాల చిన్నిచిన్న క్షీరదాలు వంటివాటిని తినడానికి అవి చెట్లు ఎక్కుతూ ఉంటాయి. ఈ పాములన్నీ ఎలుకల వంటి పంట నాశన జీవులను చంపి తినడం ద్వారా రైతుకు ఎంతో మేలు చేస్తుంటాయి. అడవిలో పునరుత్పత్తి ప్రక్రియను అదుపులో ఉంచుతాయి. మనుషులకు సంబంధించి, తమపై దాడి చేస్తారనే భయంతోనే అవి బుస కొట్టడం, కాటు వేయడం వంటివి చేస్తుంటాయి. అయితే.. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అడవులను నరికివేయడం పెరిగిపోవడంతో అవి తమ సహజ ఆవాసాలను కోల్పోతున్నాయి. ఈ క్రమంలోనే మానవ ఆవాసాల్లోకి, కొన్ని సార్లు పట్టణ ప్రాంతాల్లోకి సైతం వచ్చేస్తున్నాయి.
— Nature Chapter (@NatureChapter) July 22, 2025
ఇవి కూడా చదవండి..
Snake Festival | దేశంలోనే అతిపెద్ద పాముల జాతర..చూసేందుకే భయం
Snakes Love explained | పాముల ప్రేమ నిజమేనా? నాగరాజు, నాగిని అనుబంధంపై మళ్లీ చర్చను రేపిన రెండు పాముల విషాదాంతం!
Snake Bite First Aid | పాము కాటేస్తే చేయాల్సినదేంటి? చేయకూడనిదేంటి?