యూనిఫాంలో మ‌ల‌విస‌ర్జ‌న‌.. విద్యార్థిపై వేడినీళ్లు పోసిన టీచ‌ర్

విధాత: ఆ విద్యార్థి వ‌య‌సు ఏడేండ్లు.. రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అనుకోకుండా యూనిఫాంలోనే మ‌ల‌విస‌ర్జ‌న చేశాడు. గ‌మ‌నించిన టీచ‌ర్ ఆ విద్యార్థిపై వేడి నీళ్లు పోశాడు. దీంతో బాధిత విద్యార్థి 40 శాతం కాలిన గాయాల‌తో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాక‌ట రాయిచూర్ జిల్లాలోని సంతేక‌ల్లూరు ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో వెలుగు చూసింది. అఖిత్(7) అనే విద్యార్థి ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అయితే స్కూల్లో ఉన్న‌ప్పుడే, యూనిఫాంలోనే మ‌ల విస‌ర్జ‌న చేశాడు. టీచ‌ర్ హులిగేప్ప […]

యూనిఫాంలో మ‌ల‌విస‌ర్జ‌న‌.. విద్యార్థిపై వేడినీళ్లు పోసిన టీచ‌ర్

విధాత: ఆ విద్యార్థి వ‌య‌సు ఏడేండ్లు.. రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అనుకోకుండా యూనిఫాంలోనే మ‌ల‌విస‌ర్జ‌న చేశాడు. గ‌మ‌నించిన టీచ‌ర్ ఆ విద్యార్థిపై వేడి నీళ్లు పోశాడు. దీంతో బాధిత విద్యార్థి 40 శాతం కాలిన గాయాల‌తో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాక‌ట రాయిచూర్ జిల్లాలోని సంతేక‌ల్లూరు ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో వెలుగు చూసింది. అఖిత్(7) అనే విద్యార్థి ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అయితే స్కూల్లో ఉన్న‌ప్పుడే, యూనిఫాంలోనే మ‌ల విస‌ర్జ‌న చేశాడు. టీచ‌ర్ హులిగేప్ప ఈ విష‌యాన్ని గ‌మ‌నించి, బాధిత విద్యార్థిపై ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

ఆగ్రహంతో వేడి వేడి నీళ్ల‌ను అఖిత్‌పై పోశాడు. దీంతో ఆ విద్యార్థి శ‌రీర‌మంతా కాలిపోయి 40 శాతం కాలిన గాయాల‌తో లింగ‌స‌గూరు తాలుకా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే టీచ‌ర్ హులిగేప్ప‌పై ఫిర్యాదు చేయొద్ద‌ని అఖిత్ త‌ల్లిదండ్రుల‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న‌ను సుమోటోగా స్వీక‌రించి, టీచ‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.