రోడ్డు పక్కనే పులి.. బైకర్ కంగారు చూడాలి..!

పులిని బోనులో చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది రోడ్డు వెళుతుండగా.. పక్కనే పొదల్లో పొంచి ఉండి కనిపిస్తే? అందులోనూ ఆ సమయంలో ఏ కారో బస్సో కాకుండా.. బైక్ మీద ఉంటే? పైనుంచి కింద దాకా.. చమటలు కారిపోవడం ఖాయం. అలాంటి అనుభవమే బైక్‌పై వెళుతున్న ఒక యువకుడికి ఎదురైంది. ఈ దృశ్యాన్ని మరొకరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే.. వైరల్‌గా మారింది. రోడ్డుపక్కనే పులిని చూసిన సదరు బైక్ బోయ్.. ఒక్క ఉదుటన దాని కంట్లో పడకుండా బండిని రయ్యిన దూకించాడు.
ఈ వీడియోకు “మీరైతే ఏం చేస్తారు?” అని క్యాప్షన్ పెట్టారు. ముందుగా ఒక అంబులెన్స్ వెళుతుంటే.. ఒక యువకుడు తన బైక్‌పై దాని వెనుక వస్తున్నాడు. సాధారణంగా ఎవరూ అంబులెన్స్‌ను ఓవర్‌టేక్ చేయరు. కానీ.. ఆ యువకుడు ఉన్నట్టుండి అంబులెన్స్‌ను ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. కారణం ఏంటో కెమెరా కాస్త అటువైపు తిరిగిన తర్వాత కానీ అర్థం కాదు. ఎందుకంటే.. అక్కడ.. ఒక పెద్దపులి దాడి చేయడానికి సిద్ధం అన్నట్టు చూస్తూ నిలబడి ఉన్నది. దారిన పోతూ ఉన్న వాహనాలను చూస్తూ అక్కడే ఉన్న ఆ పులిని చూసిన యువకుడికి కంగారెత్తి అలా బైక్‌ను ముందుకు దూకించాడన్నమాట.
దీనిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. ఇంత ఆసక్తికర వీడియోను చూసి నెటిజన్లు ఊరికే ఉంటారా.. తలో కామెంట్ చేశారు. నువ్వు దాన్ని చూసి, అది కూడా నిన్ను చూసి, నిన్ను గమనిస్తున్నదంటే.. బహుశా దానికి ఆకలి లేదేమో.. అని ఒకరు కామెంట్ చేశారు. గతంలో తాను ఊటీ నుంచి బందీపూర్ టైగర్ రిజర్వ్ నుంచి వస్తుంటే అప్పుడప్పుడే చీకటి పడుతున్నదని, మార్గమధ్యంలో రాత్రి ఏడు గంటల సమయంలో పులి కనిపించిందని మరొకరు గుర్తు చేసుకున్నారు. అది తన జీవితంలో మర్చిపోలేని పీడకల అని ఆయన వ్యాఖ్యానించారు.