తిరుమల శ్రీవారికి రూ.2.4కోట్ల భారీ బంగారు శంఖుచక్రాల కానుకలు

తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన సంస్థ రూ.2.4 కోట్ల విలువైన బంగారు శంఖుచక్రాలు విరాళంగా అందించింది. సుమారు 2.5 కిలోల బరువున్న ఈ స్వర్ణ కానుకలు టీటీడీ అధికారులకు ప్రత్యేక పూజల అనంతరం అప్పగించారు.

తిరుమల శ్రీవారికి రూ.2.4కోట్ల భారీ బంగారు శంఖుచక్రాల కానుకలు

అమరావతి : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి రూ.2.4 కోట్ల విలువైన సుమారు 2.5 కిలోల బరువున్న బంగారు శంఖుచక్రాలు విరాళంగా అందాయి. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఈ బంగారు కానుకలను శ్రీవారికి సమర్పించింది. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్యచౌదరికి దాతలు ప్రత్యేక పూజల అనంతరం శంకుచక్రాలను అందజేశారు.