తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమలలో భక్తుల అధిక రద్దీ నేపథ్యంలో జూన్ 30 వరకు శుక్ర, శని, ఆదివారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్ధు చేసినట్లుగా టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

  • By: Somu |    ttd |    Published on : May 24, 2024 5:45 PM IST
తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

విధాత : తిరుమలలో భక్తుల అధిక రద్దీ నేపథ్యంలో జూన్ 30 వరకు శుక్ర, శని, ఆదివారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్ధు చేసినట్లుగా టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. వేసవి సెలవులు, ఎన్నికలు పూర్తి కావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది.

ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వలన, వారు దర్శనానికి సుమారు 30-40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వుందని టీటీడీ పేర్కోంది. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకుగాను, జున్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేయబడినదని, ఇందుకుగాను, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, ఈ మార్పును గమనించి భక్తులు సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.