మార్చి నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల
వచ్చే ఏడాది మార్చి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్ల కోటా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని, ఈ మేరకు కోటా వివరాలను టీటీడీ శనివారం ప్రకటించింది
విధాత: వచ్చే ఏడాది మార్చి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్ల కోటా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని, ఈ మేరకు కోటా వివరాలను టీటీడీ శనివారం ప్రకటించింది. ఆయా టికెట్లను ఈ డిసెంబరులోనే బుక్ చేసుకోవాలని సూచించింది. ఈనెల 18న ఉదయం 10 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 21న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేయనుండగా, 21న ఉదయం 10 గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు.
అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్‌ివం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనటికెట్ల కోటా, 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు. 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటా, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటా, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. భక్తులు ఆయా తేదీల్లో 2024 మార్చినెలకు ఆర్జిత సేవా, దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram