కొత్తగా లాంబ్డా కలకలం!
మరో రకం కరోనా 29 దేశాలకు వ్యాప్తి‘దృష్టి సారించాల్సిన రకం’గా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో విధాత:కరోనా వైరస్‌లో కొత్తగా ‘లాంబ్డా’ అనే వేరియంట్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇది అనేక దేశాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీన్ని ‘దృష్టిసారించాల్సిన వైరస్ రకం’ (వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్)గా ప్రకటించింది. బ్రిటన్‌లోని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్‌ఈ) కూడా దీన్ని ‘పరిశోధనలో ఉన్న కరోనా రకం’గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది విస్తరించడం, దీని స్పైక్ ప్రొటీన్‌లో ఎల్452క్యూ, […]

మరో రకం కరోనా 29 దేశాలకు వ్యాప్తి
‘దృష్టి సారించాల్సిన రకం’గా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో
విధాత:కరోనా వైరస్‌లో కొత్తగా ‘లాంబ్డా’ అనే వేరియంట్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇది అనేక దేశాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీన్ని ‘దృష్టిసారించాల్సిన వైరస్ రకం’ (వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్)గా ప్రకటించింది. బ్రిటన్‌లోని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్‌ఈ) కూడా దీన్ని ‘పరిశోధనలో ఉన్న కరోనా రకం’గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది విస్తరించడం, దీని స్పైక్ ప్రొటీన్‌లో ఎల్452క్యూ, ఎఫ్490ఎస్ సహా పలు ఉత్పరివర్తనలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌లో ఇప్పటివరకూ ఆరు లాంబ్డా కేసులు వెలుగు చూశాయి. ఇది తొలుత గత ఏడాది ఆగస్టులో పెరూలో కనిపించింది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది. ఏప్రిల్ నుంచి పెరూలో బయటపడిన కొవిడ్ కేసుల్లో ఈ వేరియంట్ వాటా 81 శాతం మేర ఉండటం గమనార్హం. గత 60 రోజుల్లో ఇది చిలీలో 32 శాతానికి పెరిగింది. ఈ వేరియంట్ వల్ల తీవ్ర ఇన్‌ఫెక్షన్ వస్తుందనడానికి గానీ, ప్రస్తుతం చెప్పలేమంటున్నారు.