LOKESH KANAKARAJ: తెలుగు నిర్మాతలు ఛీ కొట్టారు.. తమిళ నిర్మాతలు దండం పెడుతున్నారు.!
LOKES KANAKARAJ విధాత: అతను దేశం గర్వించదగ్గ విశ్వనటుడు దశాబ్ద కాలంగా సరైన హిట్ లేదు, నిర్మాతగా కూడా చేదు అనుభవాలు. భారీ నష్టాలు చవిచూశారు. అలాంటి సమయంలో కమలహాసన్‌కు సాలిడ్ ఇండస్ట్రీ హిట్టును అందించిన చిత్రం విక్రమ్. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్. అతి తక్కువ చిత్రాలతో దేశంలోని దిగ్గజ దర్శకుల సరసన చోటు దక్కించుకుని, ప్రస్తుతం ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు లోకేష్ కనకరాజు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలకు కూడా హాట్ […]
LOKES KANAKARAJ
విధాత: అతను దేశం గర్వించదగ్గ విశ్వనటుడు దశాబ్ద కాలంగా సరైన హిట్ లేదు, నిర్మాతగా కూడా చేదు అనుభవాలు. భారీ నష్టాలు చవిచూశారు. అలాంటి సమయంలో కమలహాసన్‌కు సాలిడ్ ఇండస్ట్రీ హిట్టును అందించిన చిత్రం విక్రమ్. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్.
అతి తక్కువ చిత్రాలతో దేశంలోని దిగ్గజ దర్శకుల సరసన చోటు దక్కించుకుని, ప్రస్తుతం ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు లోకేష్ కనకరాజు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలకు కూడా హాట్ ఫేవరెట్ డైరెక్టర్‌గా మారిపోయాడు.
ఎంతలా అంటే మెగాస్టార్ వంటివారే లోకేశ్‌ను ప్రత్యేకంగా తమ తమ ఇండ్లకు ఆహ్వానించి డిన్నర్ ఇచ్చేంతగా మన హీరోలను ఇంప్రెస్ చేశాడు. అంతేగాక ఇక తమ సినిమాలో విక్రమ్ తరహ బ్యాగ్రౌండ్ స్కోరు ఉండాలని డిమాండ్ చేసేలా చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం లోకేష్ కనకరాజుతో సినిమా చేయాలని ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
అసలు విషయానికి వస్తే విక్రమ్ సినిమాకు ముందు లోకేష్ కనకరాజ్‌ను అసలు నిర్మాతలు పట్టించు కోలేదట ముఖ్యంగా తెలుగు వారు. ఈ విషయాన్ని యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు. ఐదేండ్ల క్రితం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా మా నగరం అనే సినిమా రాగా రెండు భాషల్లోనూ మంచి విజయం సాధించింది. అప్పటి నుంచి వారి మధ్య మంచి స్నేహం కొనసాగుతున్నది.
ఆ సమయంలోనే లోకేష్ కనకరాజ్ టాలెంట్‌ను గుర్తించిన సందీప్ కిషన్ అవకాశాల కోసం లోకేష్‌ను టాలీవుడ్‌లోని ఆరుగురు ప్రొడ్యూసర్ల వద్దకు తీసుకెళ్లాడట. సందీప్ తీసుకెళ్లిన ప్రతి నిర్మాత లోకేష్‌ను పట్టించుకోలేదట. దాంతో ఆరుగురికి ఆరుగురు నిర్మాతలు రిజెక్ట్ చేయడంతో లోకేష్ తమిళ్‌లో ప్రయత్నాలు మొదలు పెట్టి కార్తీతో ఖైదీ, విజయ్‌తో మాస్టర్ కమల్‌తో విక్రమ్ సినిమాలు చేసి టాలీవుడ్‌లోను తన పేరు మారుమోగేలా చేశాడు.
ఇలా యంగ్ టాలెంట్‌ను నిరాశపరిచిన ఆ ఆరుగురు నిర్మాతలు ఎవరనే దానిపై ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. ఈ విషయం తెలిసిన అభిమానులు వారిని తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం సందీప్ కిషన్ మైకేల్ మూవీ చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.
X


Google News
Facebook
Instagram
Youtube
Telegram