ప్రభాస్‌ సలార్‌లో.. యష్‌?

SALAAR విధాత: KGF చాప్టర్ 1, చాప్టర్ 2ల తరువాత కన్నడ స్టార్ యష్ క్రేజ్ దేశ విదేశాలలో మారుమోగుతోది. ఈయన తదుపరి చిత్రం కోసం కన్నడ ప్రేక్ష‌కులే కాదు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇతర దేశాలలో కూడా య‌ష్‌కి అభిమానులు ఏర్పడ్డారు. వారు కూడా ఆయ‌న తదుపరి చిత్రంపై ఆసక్తిని చూపుతున్నారు. కానీ య‌ష్ మాత్రం తొందరపడటం లేదు. ఇప్పటివరకు ఒక సినిమాకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. […]

ప్రభాస్‌ సలార్‌లో.. యష్‌?

SALAAR

విధాత: KGF చాప్టర్ 1, చాప్టర్ 2ల తరువాత కన్నడ స్టార్ యష్ క్రేజ్ దేశ విదేశాలలో మారుమోగుతోది. ఈయన తదుపరి చిత్రం కోసం కన్నడ ప్రేక్ష‌కులే కాదు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇతర దేశాలలో కూడా య‌ష్‌కి అభిమానులు ఏర్పడ్డారు. వారు కూడా ఆయ‌న తదుపరి చిత్రంపై ఆసక్తిని చూపుతున్నారు. కానీ య‌ష్ మాత్రం తొందరపడటం లేదు. ఇప్పటివరకు ఒక సినిమాకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కేజీఎఫ్ దరశకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో స‌లార్ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గ్యాంగ్ స్టార్ కథతో యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఈ క్రమంలో ప్రభాస్‌పై చిత్రీకరించిన హై ఇంటెన్స్ యాక్ష‌న్ సీన్స్ కూడా లీక్ అయి అభిమానుల అంచనాలను పెంచాయి.

ఈ క్రమంలో ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. స‌లార్ చిత్రంలో క‌థ‌ను మ‌లుపు తిప్పే ఓ కీల‌క‌ పాత్ర పాత్ర‌లో న‌టించ‌డానికి య‌ష్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చార‌ని సోషల్ మీడియాలో వార్తలు అదే నిజమైతే అటు ప్రభాస్ ఫ్యాన్స్‌కు మ‌రో వైపు య‌ష్ ఫ్యాన్స్‌కు ఇది పండుగే అని చెప్పాలి.

ఇక సలార్‌లో ప్రభాస్ జోడిగా శృతిహాసన్ న‌టిస్తోంది. జగపతిబాబు, పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హోం బలే ప్రొడక్షన్స్ అధినేత విజయ్ కిరంగదూర్‌ దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదే బ్యానర్‌లో యష్ KGF చాప్టర్ 3కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.