Snake Found In Car Side Mirror | కారు సైడ్ మిర్రర్ లో పాము ప్రత్యక్షం!

నమక్కల్-సేలం రోడ్డుపై కారు నడుపుతున్న డ్రైవర్ కారు సైడ్ మిర్రర్‌లోంచి ఒక పాము బయటకు వచ్చే ప్రయత్నం చేయడాన్ని గమనించి షాక్‌కు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమై కారును సురక్షితంగా రోడ్డు పక్కన ఆపి పామును బయటకు పంపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Snake Found In Car Side Mirror | కారు సైడ్ మిర్రర్ లో పాము ప్రత్యక్షం!

విధాత : పార్కింగ్ కార్లలో, ద్విచక్ర వాహనాల్లో సీట్ల కింద చొరబడే పాముల ఘటనలను అడపదడపా చూశాం. అయితే ఓ పాము కారు సైడ్ మిర్రర్(అద్దం)లో దూరిన ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నమక్కల్-సేలం రోడ్‌లో ఈ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. నమక్కల్-సేలం రోడ్‌లో ఓ డ్రైవర్ కారు నడుపుతూ రహదారిపై ప్రయాణిస్తున్నాడు. అతను వెనుక, పక్కగా వెళ్లే వాహనాలు గమనించే క్రమంలో కారు సైడ్ మిర్రర్ నుంచి ఓ పాము బయటకు వచ్చే ప్రయత్నం చేయడం గమనించి షాక్ అయ్యాడు. పామును చూసి భయపడిపోయిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును పక్కకు ఆపి అందులో సైడ్ మిర్రర్ నుంచి పామును బయటకు పంపించేశాడు. అయితే అదృష్టవశాత్తూ డ్రైవర్ సురక్షితంగా కారును ఆపగలిగాడని..పామును చూసిన కంగారులో అతను డ్రైవింగ్ లో తప్పు చేసి ఉంటే కారుతో పాటు రోడ్డున వెళ్లే ఇతన వాహనదారులు కూడా ప్రమాదానికి గురయ్యే వారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వాహనాలను వినియోగించే ముందు తనిఖీ చేసుకోవాలి

ఈ సీజన్‌లో పాములు, ఇతర చిన్న జీవులు తరచుగా పార్క్ చేసిన వాహనాలలో వెచ్చదనం, ఆశ్రయం కోసం వెతుకుతుంటాయని..అందుకే వాహనాలను తరుచు పూర్తిగా తనిఖీ చేసుకోవాలని వన్యప్రాణుల నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బానెట్, వీల్ ఆర్చ్‌లు, సైడ్ మిర్రర్‌ల కింద తనిఖీ చేసి మరి వాహనాలను వినియోగించాలని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ గంటల పార్కింగ్ తర్వాత, చెట్లు, పొదల ప్రాంతాలలో పార్కింగ్ చేసిన వాహనాలలో తనిఖీ చేసుకుని డ్రైవర్లు వాటిని నడపాలని సలహా ఇస్తున్నారు.