Yellow Anaconda : సరస్సు ఒడ్డున అనకొండ..చూడకపోతే గుటకాయ స్వాహా

బ్రెజిల్‌లోని పాంటనల్ ప్రాంతంలో సరస్సు ఒడ్డున ఓ భారీ అనకొండను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అది పసుపు అనకొండ (Eunectes notaeus) అని గుర్తించారు.

Yellow Anaconda : సరస్సు ఒడ్డున అనకొండ..చూడకపోతే గుటకాయ స్వాహా

విధాత : సరస్సు ఒడ్డున దాగిన ఓ భారీ అనకొండను చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కొంచం ఏమరపాటుగా దానిని గమనించకుండా ఉండుంటే..అనకొండ నోటికి గుటకాయ స్వాహా అయిపోయేవారమని హడలిపోయారు. బ్రెజిల్‌లోని పాంటనల్ మీదుగా వెలుతున్న ఓ వ్యక్తి సరస్సు ఒడ్డున ఓ భారీ కొండచిలువను చూశాడు. తొలుతు దానిని సాధారణ పైథాన్ అనుకున్నాడు. దగ్గరికి వెళ్లి పరిశీలించి చూసి భయపడిపోయారు.

అది పసుపు అనకొండ (యూనెక్టెస్ నోటేయస్)అని..ఎక్కువగా దక్షిణ అమెరికా చిత్తడి నేలల్లో జీవిస్తుంటాయని తేలింది. హెర్పెటోలాజికల్ రికార్డుల ప్రకారం పసుపు అనకొండలు సగటున 3.7 మీటర్ల పొడవు, 25-35 కిలోల బరువు కలిగి ఉంటాయని, రెటిక్యులేటెడ్ పైథాన్, గ్రీన్ అనకొండ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద పాము జాతిగా గుర్తించబడిందని తెలుసుకున్నారు. సహజంగా ఈ పసుసు అనకొండలు మనుషులు వాటి జోలికి వెళ్లి రెచ్చగొట్టకపోతే..అవి కూడా మనుషుల పట్ల ప్రమాదకంగా వ్యవహరించవని సరీసృప నిపుణుల కథనం.
ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల చిత్తడి నేలలైన పాంటనల్ ప్రాంతం 650 కంటే ఎక్కువ పక్షి, 400 చేప జాతులకు నిలయంగా ఉండటం విశేషం.