డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక టెస్ట్ DRIVE అవసరం లేదు
విధాత:అధీకృత డ్రైవింగ్ స్కూల్‌లో శిక్షణ పొందితే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలు రూపొందించినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఒక కథనం ప్రచురించింది.డ్రైవింగ్ లైసెన్సు కోసం ఇకపై ఆర్టీవో కార్యాలయాల్లో పరీక్షలకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. అధీకృత డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ పూర్తిచేసుకుని, సర్టిఫికెట్ పొందితే చాలు. దాని ఆధారంగా టెస్టు లేకుండా డ్రైవింగ్ లైసెన్సు పొందవచ్చు. ఈ విషయాన్ని కేంద్రం అధీకృత డ్రైవింగ్ స్కూళ్లకు శుక్రవారం విడుదల చేసిన మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే.. […]

విధాత:అధీకృత డ్రైవింగ్ స్కూల్‌లో శిక్షణ పొందితే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలు రూపొందించినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఒక కథనం ప్రచురించింది.డ్రైవింగ్ లైసెన్సు కోసం ఇకపై ఆర్టీవో కార్యాలయాల్లో పరీక్షలకు హాజరవ్వాల్సిన అవసరం లేదు.
అధీకృత డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ పూర్తిచేసుకుని, సర్టిఫికెట్ పొందితే చాలు.
దాని ఆధారంగా టెస్టు లేకుండా డ్రైవింగ్ లైసెన్సు పొందవచ్చు.
ఈ విషయాన్ని కేంద్రం అధీకృత డ్రైవింగ్ స్కూళ్లకు శుక్రవారం విడుదల చేసిన మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే.. ఆర్టీయే నుంచి లైసెన్సులు పొందిన అధీకృత డ్రైవింగ్ స్కూళ్లు వాహనాల శిక్షణ కోసం సిమ్యులేటర్లను సమకూర్చుకోవడం.. కనీసం ఎకరా స్థలానికి తగ్గకుండా టెస్టింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేసుకోవడం వంటి మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.
డ్రైవింగ్ స్కూల్‌లో నిర్వహించే టెస్టు వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించి, శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇస్తారు.