Mega Sudha Reddy at Met Gala | మేఘా కృష్ణారెడ్డి భార్య నెక్లెస్ ధర తెలిస్తే గుండెపోటే..!
మొన్న మెట్ గాలా 2024కు హాజరైన ఎందరో సెలబ్రిటీలలో సినిమా హీరోయిన్లు, ఫ్యాషన్ ఐకన్లు, మహిళా పారిశ్రామికవేత్తలు మెరిసిపోయారు. అందరిలోకి అందంగా మెరిసిపోయింది మాత్రం సుధారెడ్డి మాత్రమే.

మెట్‌గాలా(Met Gala 2024)…. ఫ్యాషన్ ప్రపంచానికి అతి గొప్ప రాత్రిగా అభివర్ణించబడే పండుగ. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కోసం నిర్వహించే నిధుల సేకరణ కార్యక్రమం. ఈ ఈవెంట్ ప్రతీ సంవత్సరం మే నెల మొదటి సోమవారం నాడు న్యూయార్క్‌లో నిర్వహించబడుతుంది. ఈసారి మే 6న వెలుగుజిలుగుల మధ్య ఈ ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఫ్యాషన్ దిగ్గజాలు, సినిమా నాయికలు, ఫ్యాషన్ సృష్టికర్తలు, ఈ రంగంలో యువ కెరటాలు ఇందులో పాల్గొన్నారు.
సుధారెడ్డి.. క్వీన్ బీ ఆఫ్ హైదరాబాద్ Queen Bee of Hyderabad( హైదరాబాద్ రాణీగ)గా పిలువబడే ఈ అతివ, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(మెయిల్) Megha Engineering & Infrastructure Ltd అధినేత కృష్ణారెడ్డి సతీమణి. మెయిల్లో ఈమె డైరెక్టర్ కూడా.
మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అంటే తెలుసుకదా.. ఎలక్టోరల్ బాండ్స్ (Electoral Bonds) విషయంలో అత్యధికంగా కొనుగోలు చేసిన కంపెనీలలో మేఘా ఇంజనీరింగ్ రెండవస్థానంలో ఉంది. దాదాపు 966 కోట్ల విలువైన బాండ్లు మేఘా కొనుగోలు చేసింది. 4500 కోట్ల విలువైన జోజిలాపాస్ (zojila tunnel) సొరంగాన్ని మేఘా ఇంజనీరింగ్ కంపెనీనే నిర్మించింది.
తనను తాను కళలు, ఫ్యాషన్ రంగాలపై అమితాసక్తి గల మేధావిగా అభివర్ణించుకునే సుధ, దానధర్మాలకు కూడా పేరుగాంచింది. తన ఆధ్వర్యంలో ఎన్నో చారిటబుల్ ట్రస్టులు కూడా నడుస్తున్నాయి. విజయవాడకు చెందిన సుధ 19 ఏళ్లకే పెళ్లిచేసుకుని ఇద్దరు కొడుకులకు తల్లయింది.
2024 మెట్‌గాలాలో సుధారెడ్డి ధరించిన వజ్రాల నెక్లెస్( Diamond Necklace) అందరి దృష్టనీ ఆకర్షించి, ఆ రాత్రి టాక్ ఆఫ్ న్యూయార్క్ గా మారిపోయింది. ఆ నగ ఒక్కటే 180 క్యారెట్ల వజ్రాలతో పొదగబడిఉంది. మీరు విన్నది నిజమే. అక్షరాల 180 క్యారెట్ల వజ్రాలు. ఇందులో ఒకటి 25 క్యారెట్ల హృదయాకారపు వజ్రం కాగా, మరో మూడు 20 క్యారెట్ల హృదయాకారపువి. ఈ మూడూ తన భర్త, ఇద్దరు పిల్లలను ప్రతిబింబిస్తాయని అమె తెలిపింది. ఈ నెక్లెస్ పేరు ‘అమోర్ ఎటెర్నో’Amore Eterno(ఇటాలియన్ లో అంతులేని ప్రేమ). ఇదే కాకుండా 23, 20 క్యారెట్ల వజ్రాలు పొదిగిన రెండు ఉంగరాలు( Solitaire Rings) కూడా తొడిగింది. మొత్తానికి ఈ వజ్రపు ఆభరణాల విలువ 20 మిలియన్ డాలర్లు( $20 Million)..అంటే రెండు కోట్ల డాలర్లు..అంటే దాదాపు 170 కోట్ల రూపాయలు. అవును.. అక్షరాలా నూటాడెబ్భై కోట్ల రూపాయలు మాత్రమే.
2021లో మెట్గాలాలోకి ఎంట్రీ ఇచ్చిన సుధ, అప్పుడు ప్రముఖ డిజైనర్ జంట ఫాల్గుణి–షేన్ పీకాక్ డిజైన్ చేసిన గౌన్ ధరించింది. ఇది రెండవసారి. ఈసారి ఆమె ధరించిన గౌను సెలిబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహ్లియానీ(Tarun Tahliani) డిజైన్ చేసారు. 80 మంది కళాకారులు దాదాపు 4500 గంటలు కష్టపడి చేత్తో తయారుచేసారు. ప్రతీ చిన్న డిజైన్‌ను కూడా నిశితంగా పరిశీలించి తయారుచేసారని తెలుస్తోంది.