Millet Food Business | ఆమె చదివింది పదో తరగతే.. సంపాదన మాత్రం రూ. 70 లక్షలు..!
Millet Food Business | ఆమె గొప్పగా చదువుకోలేదు. అందరి మాదిరి పదో తరగతి( Tenth Class ) వరకు చదువుకుంది. కానీ ఆర్థికంగా ఎదగాలన్న ఆకాంక్ష ఆమెను బిజినెస్( Business ) వైపు మళ్లించింది. ఆవు పాల( Cow Milk )తో వ్యాపారం ప్రారంభించింది. కానీ ఆర్థికంగా స్థిరపడలేదు. సీన్ కట్ చేస్తే రోస్టెడ్ సోయా నట్స్( Roasted Soya Nuts ) అమ్మింది. అటు వైపు నుంచి మిల్లెట్ ఫుడ్( Millet Food Business ) వైపు అడుగులు వేసింది. ఈ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించి రూ. 70 లక్షల టర్నోవర్‌కు ఎదిగింది. మరి ఆమె గురించి తెలుసుకోవాలంటే హర్యానా( Haryana ) వెళ్లాల్సిందే.
Millet Food Business | హర్యానా( Haryana )లోని చాందు గ్రామానికి( Chandu Village ) చెందిన పూజ శర్మ( Pooja Sharma ) చిన్నప్పటి నుంచే వ్యవసాయ( Agriculture ) పనులకు వెళ్లేది. ఆమె పదో తరగతి వరకు మాత్రమే చదివింది. పది పాసయ్యాక పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లాయ్యక కొన్నాళ్లకు అత్తమామలు కుటుంబ ఆస్తులను పంచుకున్నారు. దీంతో పూజ శర్మకు ఆర్థిక కష్టాలు( Financial Problems ) మొదలయ్యాయి. భూగర్భ జలాలు( Ground Water ) కూడా సరిగ్గా లేకపోవడంతో వ్యవసాయం చేయడం కూడా కష్టంగా మారింది.
అంగన్‌వాడీ వర్కర్‌గా ఏడాదిన్నర
పూజ శర్మ భర్త జాబ్ చేయడం ప్రారంభించాడు. కానీ ముగ్గురు పిల్లలను పోషించేందుకు ఆయన సంపాదన కూడా సరిపోలేదు. దీంతో పూజ శర్మ ఓ ఎన్జీవో సంస్థలో నెలకు రూ. 2500 జీతానికి అంగన్‌వాడీ వర్కర్( Anganwadi Worker )గా చేరింది. ఈ జాబ్ చేసేందుకు ఆమె రోజుకు ఐదు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. 1.5 కి.మీ. కాలినడకన వెళ్లి.. మరో 3.5 కిలోమీటర్లకు రూ. 5 చెల్లించి ఆటోలో ప్రయాణించేది. రూ. 5 చెల్లించడం కూడా శర్మకు కష్టంగా ఉండేది. అంగన్‌వాడీ వర్కర్‌గా ఏడాదిన్నర చేశాక.. ఆ జాబ్ కూడా కోల్పోయింది పూజ.
ఆవు పాలతో ఆర్థిక స్థిరత్వం..
ఇతరుల వద్ద ఉద్యోగం చేయడం కంటే సొంతంగా ఏదో ఒక బిజినెస్ చేయాలని పూజ శర్మ సంకల్పించింది. అనుకున్నదే ఆలస్యం.. ఓ ఆవు( Cow )ను కొనుగోలు చేసింది. తన ఇంటికి సరిపడ పాలు తీసుకున్న తర్వాత మిగిలిన పాలను విక్రయించేది. వచ్చే ఆ డబ్బులతో కాస్త ఆర్థిక స్థిరత్వం నెలకొంది. దీంతో మరిన్ని ఆవులను కొనుగోలు చేసి డెయిరీ బిజినెస్‌ను విస్తరించింది పూజ శర్మ.
రోస్టెడ్ సోయా నట్స్( Roasted Soya Nuts ) పై శిక్షణ
అయితే వ్యూహాత్మకంగా ఆమె కృషి విజ్ఞాన కేంద్రం( Krishi Vigyan Kendra )వైపు అడుగులు వేసింది. అక్కడ మహిళలకు ఉచితంగా ఇస్తున్న శిక్షణ గురించి తెలుసుకుంది. గురుగ్రామ్‌లోని కేవీకే( KVK ) సెంటర్‌కు వెళ్లి.. రోస్టెడ్ సోయా నట్స్( Roasted Soya Nuts ) పై శిక్షణ తీసుకుంది. ఈ శిక్షణ తీసుకునే సమయంలోనే కొంత మంది మహిళలను తనతో కలుపుకుని, స్వయం సహాయక సంఘాన్ని( Self Help Groups ) నెలకొల్పింది. ఆ తర్వాత సంఘంలోని సభ్యులందరూ కలిసి రోస్టెడ్ సోయా నట్స్ బిజినెస్‌ను 2013లో తన పూర్వీకుల నివాసంలో ప్రారంభించింది పూజ శర్మ.
మిల్లెట్ ఫుడ్స్( Millet Foods )తో రూ. 70 లక్షల టర్నోవర్
రోస్టెడ్ సోయా నట్స్ వ్యాపారంతోనే ఆమె ఆగిపోలేదు. లాభాలు గడిస్తున్న శర్మ.. మిల్లెట్ బిజినెస్( Millet Food Business )ను ప్రారంభించి మొత్తం 70 రకాల స్వీట్స్‌ను తయారు చేయడం ప్రారంభించింది. ఈ ఉత్పత్తుల నిమిత్తం పూజ శర్మ క్షితిజ్ మిల్లెట్స్ ప్రయివేటు లిమిటెడ్( Kshitiz Millets Pvt Ltd ) కంపెనీని 2024 నవంబర్‌లో నెలకొల్పింది. ఈ కంపెనీ ద్వారా జొన్నలు, సజ్జలు, రాగులతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించింది. కొబ్బరి, చియా సీడ్స్, బెల్లం వంటి పదార్థాలతో మరికొన్ని పదార్థాలను తయారు చేసి అమ్మడం ప్రారంభించింది. అలా మిల్లెట్ ఫుడ్స్ వ్యాపారంతో గత ఆర్థిక సంవత్సరం రూ. 70 లక్షల టర్నోవర్‌కు ఎదిగింది పూజ శర్మ.

మిల్లెట్ ఫుడ్స్‌కు మంచి డిమాండ్
పూజ ఉత్పత్తి చేసే మిల్లెట్ ఫుడ్స్‌కు మంచి డిమాండ్ ఉంది. కార్పొరేట్ కంపెనీలు, ఎన్జీవో సంస్థలు, ప్రభుత్వ సంస్థల భారీగా కొనుగోలు చేస్తున్నారు. క్షితిజ్ కంపెనీ ఆన్‌లైన్ ద్వారా కూడా విక్రయాలను జరుపుతుంది. మీషో, ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయదారులకు విక్రయిస్తున్నారు.
25 మంది మహిళలకు ఉపాధి.. 3 వేల మందికి మార్గదర్శకం
ప్రస్తుతం క్షితిజ్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ ద్వారా 10 రకాల రుచికరమైన ఆహార పదార్థాలు, 30 రకాల బిస్కెట్లు, ఐదు రకాల వంటకాలు, 20 రకాల లడ్డూలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కంపెనీలో 25 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇక పూజ శర్మ అగ్రికల్చర్ యూనివర్సిటీలకు వెళ్లి.. తృణ ధాన్యాల ప్రాధాన్యత, వాటి తయారీపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత కోసం పూజ శర్మ కృషి చేస్తుంది. ఇప్పటికే 3 వేల మంది మహిళలకు పూజ శర్మ మార్గదర్శకంగా నిలిచారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram