తొలిసారి 350 మెగావాట్ల కుసుమ్ ప్రాజెక్టులు
విధాత,అమరావతి: వ్యవసాయానికి విద్యుత్ సరఫరా కోసం పీఎం కుసుమ్ పథకం కింద 350 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొదటిసారి మంజూరు చేసింది. దీని ద్వారా 50 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను సౌర విద్యుత్ పరిధిలోకి తేవాలని కేంద్రం పేర్కొంది. ఈ పథకం కింద గరిష్ఠంగా 10 మెగావాట్ల ప్రాజెక్టుల వరకు మాత్రమే అనుమతిస్తుంది. ఒక్కో మెగావాట్‌కు రూ.3.4 కోట్ల చొప్పున ప్రాజెక్టు వ్యయంలో 30% రాయితీగా అందిస్తుంది. దీని ప్రకారం […]

విధాత,అమరావతి: వ్యవసాయానికి విద్యుత్ సరఫరా కోసం పీఎం కుసుమ్ పథకం కింద 350 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొదటిసారి మంజూరు చేసింది. దీని ద్వారా 50 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను సౌర విద్యుత్ పరిధిలోకి తేవాలని కేంద్రం పేర్కొంది. ఈ పథకం కింద గరిష్ఠంగా 10 మెగావాట్ల ప్రాజెక్టుల వరకు మాత్రమే అనుమతిస్తుంది. ఒక్కో మెగావాట్‌కు రూ.3.4 కోట్ల చొప్పున ప్రాజెక్టు వ్యయంలో 30% రాయితీగా అందిస్తుంది. దీని ప్రకారం మెగావాట్‌కు రూ.1.05 కోట్ల రాయితీ వస్తుంది.
ఏపీఈఆర్‌సీ నుంచి ఆమోదం
రాష్ట్రంలో 350 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఏపీఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది. ఈమేరకు టెండర్లు పిలవడానికి నెడ్‌క్యాప్ మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారితో డిస్కంలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) కుదుర్చుకుంటాయి. ఫీడర్ల వారీగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల డిమాండ్‌ను అధికారులు గుర్తించి అందుకనుగుణంగా ప్రాజెక్టులను ప్రతిపాదించనున్నారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో యూనిట్ ధరను నిర్ణయించి డిస్కంలు పీపీఏలు చేసుకుంటాయి.