కోర్టు ధిక్కార కేసు లో హైకోర్టుకు హాజరైన నలుగురు ఐఏఎస్ లు

విధాత‌:హైకోర్టుకు హాజరైన వారిలో పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీ లక్ష్మి, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. పాఠశాలల భవనాలలో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయం నిర్మాణం పై హై కోర్టులో దిక్కర కేసు విచారణ.స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని వ్యాఖ్యానించిన ధర్మాసనం.పేద పిల్లలు చదువుకునే స్కూల్ లో వాతావరణం కలుషితం చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్య‌క్తం చేసింది. ఎవరైనా […]

  • Publish Date - August 9, 2021 / 08:56 AM IST

విధాత‌:హైకోర్టుకు హాజరైన వారిలో పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీ లక్ష్మి, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్.

పాఠశాలల భవనాలలో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయం నిర్మాణం పై హై కోర్టులో దిక్కర కేసు విచారణ.స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని వ్యాఖ్యానించిన ధర్మాసనం.పేద పిల్లలు చదువుకునే స్కూల్ లో వాతావరణం కలుషితం చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్య‌క్తం చేసింది.

ఎవరైనా ఈ పాఠశాలలో చదువుకున్నార అని ప్రశ్నించిన హైకోర్టు జడ్జి దేవానంద్, హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించిన న్యాయమూర్తి,పాఠశాల ఆవరణ లోకి రాజకీయాలు తీసుకెళ్తార అని ప్ర‌శ్నించింది.తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేస్తూ అధికారులంతా హాజరుకావాలని ఆదేశించింది.దీంతో అన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నివేదిక ఇస్తామన్న ఏజీ.