రాయలసీమకు అనుమతివ్వండి.. గజేంద్రసింగ్ షెకావత్‌కు విజయసాయి విజ్ఞప్తి
విధాత:న్యూ ఢిల్లీ: తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసిన ఆయన కేఆర్‌ఎంబీని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు.కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ గురువారం నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రి షెకావత్‌ను కలిసిన విషయం […]

విధాత:న్యూ ఢిల్లీ: తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసిన ఆయన కేఆర్‌ఎంబీని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు.కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ గురువారం నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రి షెకావత్‌ను కలిసిన విషయం తెలిసిందే. కృష్ణా బోర్డు ఆదేశాలకు భిన్నంగా తెలంగాణ నీటిని మళ్లించి విద్యుదుత్పత్తి చేసుకోవడంతో నీరు వృథా అవుతుందని ఫిర్యాదు చేశారు. తెలంగాణ నీటి మళ్లింపును నిలిపివేయించాలని, కేంద్ర బలగాలతో ప్రాజెక్టుల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని కోరారు.