ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యంపై సవరణ ఉత్తర్వులు
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జులై ఒకటి నుంచి ఇవ్వాల్సిన కరవు భత్యానికి సంబంధించి సవరణ ఉత్తర్వులిచ్చారు. 2020 నవంబరులో ఇచ్చిన కరవు భత్యం ఉత్తర్వుల్లో.. అదే ఏడాది డిసెంబరు నెలాఖరు వరకు పదవీ విరమణ చేసే వారికే నగదు రూపంలో బకాయిలను చెల్లిస్తామని పేర్కొన్నారు. తాజాగా 2021 జూన్ నెలాఖరు వరకు పదవీ విరమణ చేసే ఉద్యోగులకూ నగదు రూపంలో బకాయిలను చెల్లిస్తామంటూ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర […]

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జులై ఒకటి నుంచి ఇవ్వాల్సిన కరవు భత్యానికి సంబంధించి సవరణ ఉత్తర్వులిచ్చారు. 2020 నవంబరులో ఇచ్చిన కరవు భత్యం ఉత్తర్వుల్లో.. అదే ఏడాది డిసెంబరు నెలాఖరు వరకు పదవీ విరమణ చేసే వారికే నగదు రూపంలో బకాయిలను చెల్లిస్తామని పేర్కొన్నారు. తాజాగా 2021 జూన్ నెలాఖరు వరకు పదవీ విరమణ చేసే ఉద్యోగులకూ నగదు రూపంలో బకాయిలను చెల్లిస్తామంటూ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ వినతి మేరకు ఈ మార్పులు చేసినట్లు జీవోలో పేర్కొన్నారు.