మద్యం డంప్ పై సెబ్ పోలీసుల మెరుపు దాడులు
అనంతపురం : గుంతకల్లు మండల పరిధిలో కర్నాటక మద్యం డంప్ పై సెబ్ పోలీసుల మెరుపు దాడులు భారీగా …రూ. 10 లక్షల విలువ చేసే 11,664 టెట్రా పాకెట్లు కల్గిన 141 బాక్సుల కర్నాటక మద్యం స్వాధీనం కేసు నమోదు… అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభం జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం నియంత్రణకు కొనసాగుతోన్న దాడులు విధాత:అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కమ్మ కొట్టాల సమీపంలో దాచిన కర్నాటక మద్యం డంప్ […]

- అనంతపురం : గుంతకల్లు మండల పరిధిలో కర్నాటక మద్యం డంప్ పై సెబ్ పోలీసుల మెరుపు దాడులు
- భారీగా …రూ. 10 లక్షల విలువ చేసే 11,664 టెట్రా పాకెట్లు కల్గిన 141 బాక్సుల కర్నాటక మద్యం స్వాధీనం
- కేసు నమోదు… అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభం
- జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం నియంత్రణకు కొనసాగుతోన్న దాడులు
విధాత:అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కమ్మ కొట్టాల సమీపంలో దాచిన కర్నాటక మద్యం డంప్ పై సెబ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. భారీగా …రూ. 10 లక్షల విలువ చేసే 11,664 టెట్రా పాకెట్లు కల్గిన 141 బాక్సుల కర్నాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం నియంత్రణ కోసం సెబ్ అదనపు ఎస్పీ జె.రాంమోహనరావు పర్యవేక్షణలో సెబ్ విభాగం పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా… అనంతపురం ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ నారాయణస్వామి ఆధ్వర్యంలో గుంతకల్లు సెబ్ విభాగం ఇన్ఛార్జి సి.ఐ సుభాషిణి , ఎస్సై అహ్మద్ అలీ మరియు సెబ్ సిబ్బంది బృందంగా ఏర్పడి రాబడిన పక్కా సమాచారంతో కమ్మ కొట్టాల సమీపంలో దాచిన అక్రమ మద్యం డంప్ పై ఈరోజు దాడులు నిర్వహించారు. మొత్తం11,664 టెట్రా పాకెట్లు కల్గిన 141 కర్నాటక మద్యం బాక్సులు సీజ్ చేశారు. ఇందులో 90 ml కల్గిన 9,792… 180 ml కల్గిన 1872 టెట్రా పాకెట్లు ఉన్నాయి. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుంది. అక్రమంగా కర్నాటక మద్యం నిల్వ ఉంచడంపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ దాడుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.