AP CS Vijayanandh : ఏపీ సీఎస్ విజయానంద్ పదవీ కాలం పొడిగింపు !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు (డిసెంబర్ 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు) పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Nov 29, 2025, 6:41 pm IST
Read Time: 3 mins
AP CS Vijayanandh : ఏపీ సీఎస్ విజయానంద్ పదవీ కాలం పొడిగింపు !

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు మాసాలు పొడిగించారు. డిసెంబర్ 1వ తేదీ నుండి 2026 ఫిబ్రవరి 28 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ శనివారం ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 2230 ద్వారా ఆదేశాలు జారీ చేసింది.కేంద్ర ప్రభుత్వం సీఎస్ విజయానంద్ పదవీ కాలాన్ని మూడు మాసాల పాటు పొడిగించేంచేందుకు ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.

వాస్తవానికి ఈనెల 30న సీఎస్ విజయానంద్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ణప్తి మేరకు ఆయన పదవీ కాలాన్ని మరో మూడు మాసాల పాటు.. ఫిబ్రవరి 28వ తేదీ వరకు పోడిగిస్తూ కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

అనంతరం వచ్చే 2026 మార్చి 1వ తేదీ నుండి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ప్రస్తుత రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీఎంవో ఈవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ను నియమిస్తూ ఇదే ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. విజయానంద్ పదవీ విరమణ అనంతరం 2026 మార్చి 1వ తేది నుండి తదుపరి సీఎస్ గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు.