అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్‌ బాల్స్‌ తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సదర్బంగా ఎన్టీఆర్‌ జిల్లా మూలపాడు బటర్‌ఫ్లై పార్కులో నిర్వహించిన పర్యావరణ వేడుకలలో పవన్‌ పాల్గొన్నారు. తన తల్లి అంజనా దేవి పేరిట కొండపల్లి బొమ్మల తయారీలో వినియోగించే తెల్ల పొణికి మొక్క నాటి వేడుకలు ప్రారంభించారు.

Reported by: Y.V. Narsimha Reddy | ఆంధ్ర ప్రదేశ్ | Jun 05, 2026, 12:41 pm IST
Read Time: 3 mins
అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్‌ బాల్స్‌ తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సదర్బంగా ఎన్టీఆర్‌ జిల్లా మూలపాడు బటర్‌ఫ్లై పార్కులో నిర్వహించిన పర్యావరణ వేడుకలలో పవన్‌ పాల్గొన్నారు. తన తల్లి అంజనా దేవి పేరిట కొండపల్లి బొమ్మల తయారీలో వినియోగించే తెల్ల పొణికి మొక్క నాటి వేడుకలు ప్రారంభించారు. విద్యార్థులు, గ్రామస్థులతో కలిసి స్వయంగా సీడ్ బాల్స్ తయారీ చేశారు. వేడుకలలో భాగంగా ఏకకాలంలో స్థానిక విద్యార్థులు 1,000 అంకుడు మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని కాపాడుతుందని ఏపీ డిప్యూటీసీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ “మా కే నామ్ ఏక్ పేడ్” నినాద స్ఫూర్తితో ప్రతి ఒక్కరు తమ మాతృమూర్తి పేరిట ఒక మొక్క నాటాలని పవన్ కల్యాణ్ సూచించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణకు ఈ నెల 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్‌ బాల్స్‌ తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. విత్తన బంతులను అడవులు, కొండ ప్రాంతాలు, నదీతీరాల్లో వెదజల్లే ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పీవీ చలపతిరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ , జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, మైలవరం ఇంచార్జి అక్కల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.