చంద్రబాబుపై మరో కేసు.. 6కు చేరిన కేసులు

విధాత : టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. టీడీపీ ప్రభుత్వ హాయంలో ఇసుక అక్రమాలకు సంబంధించిన కేసులో అప్పటి మైనింగ్ శాఖ మంత్రి పీతల సుజాతను ఏ1గా, చంద్రబాబును ఏ 2గా కేసులో పేర్కోంది. వారితో పాటు చింతమనేని ప్రభాకర్,, దేవినేని ఉమలను కూడా కేసులో చేర్చింది.
దీంతో చంద్రబాబుపై ఏపీ సీఐడీ పెట్టిన కేసుల సంఖ్య 6కు చేరుకుంది. స్కీల్ డెవలప్‌మెంట్ స్కామ్, ఆర్‌ఆర్‌ఆర్, ఫైబర్ నెట్, ఆసైన్డ్ భూములు, మద్యం అనుమతులకు సంబంధించిన కేసులతో పాటు ఇసుక స్కామ్ కేసు జాబితాలో చేరింది. ఇటు తెలంగాణలో కూడా బుధవారం బేగంపేట్ విమానశ్రయం నుంచి జూబ్లిహిల్స్‌లోని తన నివాసానికి ర్యాలీగా వచ్చే క్రమంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై కేసు నమోదుకావడం గమనార్హం