ఏపి సీఎం మహిళ..తడబడ్డ జగన్
విధాత:ఏపీ సీఎం జగన్ టంగ్ స్లిప్ అవ్వడంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. తరుచూ మాటలు తడబడుతూ ట్రోలర్లకు ఇట్టే చిక్కుతున్నారు. తాజాగా ‘‘ఏపీ సీఎం ఓ మహిళ’’ అంటూ నోరు జారారు. ఇప్పుడా మాటలు మరింత వైరల్ అవుతున్నాయి. గొల్లపూడిలో జరిగిన దిశ యాప్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తడబాటుకు గురయ్యారు. దిశ యాప్ గురించి చెబుతూ.. ‘‘ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఓ మహిళ కాబట్టి’’ అన్నారు. […]

విధాత:ఏపీ సీఎం జగన్ టంగ్ స్లిప్ అవ్వడంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. తరుచూ మాటలు తడబడుతూ ట్రోలర్లకు ఇట్టే చిక్కుతున్నారు. తాజాగా ‘‘ఏపీ సీఎం ఓ మహిళ’’ అంటూ నోరు జారారు. ఇప్పుడా మాటలు మరింత వైరల్ అవుతున్నాయి.
గొల్లపూడిలో జరిగిన దిశ యాప్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తడబాటుకు గురయ్యారు. దిశ యాప్ గురించి చెబుతూ.. ‘‘ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఓ మహిళ కాబట్టి’’ అన్నారు. వెంటనే పక్కనే ఉన్న హోంమంత్రి మేకతోటి సుచరిత కల్పించుకుని.. ‘‘హోమ్ మినిస్టర్’’ అని గుర్తు చేశారు. అప్పుడు తేరుకున్న సీఎం.. హోమ్ మినిస్టర్ అంటూ తనదైన శైలిలో నవ్వారు.