విధాత: తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఆక్సిజన్ సకాలంలో రాకపోవడం వల్లే రోగులు మృతి చెందారని వెల్లడించింది. ఆక్సిజన్ రావడంలో జాప్యంతోనే 23 మంది చనిపోయినట్లు అఫిడవిట్ సమర్పించింది. ఆక్సిజన్ సరఫరా కంపెనీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొంది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు కోర్టుకు తెలిపింది. గత మే నెలలో తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం నెలకొని కరోనా బాధితులు మృతి చెందిన విషయం తెలిసిందే.