అమరావతి అసైన్డ్ భూముల కేసు రీఓపెన్ 1కి వాయిదా

అమరావతి అసైన్డ్ భూముల రీ ఓపెన్ కేసును వచ్చే నెల 1వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కొత్త ఆధారాలు పరిగణలోకి తీసుకుని విచారించాలని

అమరావతి అసైన్డ్ భూముల కేసు రీఓపెన్ 1కి వాయిదా
  • 18న ఐఆర్ కేసులో బాబు ముందస్తు బెయిల్ విచారణ

విధాత : అమరావతి అసైన్డ్ భూముల రీ ఓపెన్ కేసును వచ్చే నెల 1వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కొత్త ఆధారాలు పరిగణలోకి తీసుకుని విచారించాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించింది. సీఐడీ సమర్పించిన కొత్త ఆధారాలను పరిశీలించింది. సీఐడీ న్యాయవాదులు జడ్జీకి పలు ఆడియో ఆధారాలు అందించడంతో పాటు మరికొన్ని వీడియో ఆధారాలు మంగళవారం అందిస్తామని తెలిపారు. కాగా ప్రతివాదులు కేసు రీ ఓపెన్ పట్ల కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

కేసు విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. అటు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 41ఏ కింద నోటీస్‌లు అందుకున్న కిలారు రాజేశ్ సోమవారం తాడేపల్లి సిట్ కార్యాలయంలో సీఐడీ విచారణకు హాజరయ్యారు.