Tonic Liquor Mart Trademark Violation In Nellore | టానిక్ బ్రాండ్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
టానిక్ బ్రాండ్ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరులోని టానిక్ ఫ్లెక్సీలు తొలగించాలని సూచించింది.

అమరావతి : మద్యం అమ్మకాలు సాగించే టానిక్ లిక్కర్ మార్ట్ సంస్థ వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
తమ బ్రాండ్ నేమ్ కాపీ చేయటంపై ఏపీ హైకోర్ట్ లో ఆ సంస్థ పిటిషన్ వేసింది. తమ టానిక్ లిక్కర్ బ్రాండ్ పేరు అర్ధం వచ్చే విధంగా నెల్లూరుకు చెందిన చక్రవర్ధన్ రెడ్డి ది టానిక్ పేరుతో నెల్లూరులో షాప్ నిర్వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ టానిక్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇరువురి వాదనలు విన్న ఏపీహై కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
మూడు రాష్ట్రాల్లో టానిక్ బ్రాండ్ తో అమ్మకాలు చేస్తున్న సంస్థ ట్రేడ్ మార్క్ లో నమోదైన టానిక్ పేరు అర్ధం వచ్చేలా నెల్లూరు చక్రవర్దన్ రెడ్డి వైన్ షాప్ ఏర్పాటు చేయటం కరెక్ట్ కాదని హైకోర్టు స్పష్టం చేసింది. టానిక్ ట్రేడ్ మార్క్ బ్రాండ్ వేరే ఎవరు వాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరులో టానిక్ బ్రాండ్ ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలలో టానిక్ మార్ట్ నిర్వాహకులకు భారీ ఊరట దక్కింది.