Urvashi Rautela Summoned by ED | ఈడీ విచారణకు హాజరైన నటి ఊర్వశి రౌతేలా

నిషేధిత బెట్టింగ్ యాప్‌ల కేసులో నటి ఊర్వశి రౌతేలా ఈడీ విచారణకు హాజరై సంబంధిత ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

Urvashi Rautela Summoned by ED | ఈడీ విచారణకు హాజరైన నటి ఊర్వశి రౌతేలా

విధాత : నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ల కేసులో నోటీసులు అందుకున్న సినీనటి ఊర్వశి రౌతేలా మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈనెల 15న జారీ చేసిన ఈడీ సమన్ల నేపథ్యంలో ఢిల్లీలోని దర్యాప్తు సంస్థ కార్యాలయానికి ఊర్వశీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమెను ఈడీ అధికారులు బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం, వాటితో ఆమెకు ఉన్న సంబంధం, తీసుకున్న పేమెంట్స్‌ తదితర అంశాల గురించి ప్రశ్నించారు.

ఇప్పటికే ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఈడీ సినీ ప్రముఖులను, క్రికెటర్లను విచారించిన సంగతి తెలిసిందే. మంచు లక్ష్మి, సురేశ్‌ రైనా, రానా, సోనూసూద్‌, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్ లు కూడా ఇటీవల ఈ కేసులో విచారణకు హాజరయ్యారు.