విధాత: రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి తెనాలి మండలం పెదరావురు వద్ద జరిగింది. రేపల్లె కు చెందిన బాల వెంకట శివరామకృష్ణ ప్రసాద్ (50) పెదరావురు గ్రామీణ బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నారు, ఆదివారం రాత్రి పెదరావూరు నుండి రేపల్లె వెళ్తుండగా పెదరావూరు చెరువు దగ్గర ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పై తెనాలి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు