చావు పరామర్శకు వెళ్ళి.. యుద్ధంలో గెలిచినట్టు లోకేష్ చేష్టలేంటి..!?

విధాత‌: గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రభుత్వం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. హోం మంత్రి సుచరిత నిన్ననే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి, వారికి సాయాన్ని అందించి, ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థినిని ఈ విధంగా హత్య చేయడం చాలా బాధాకరం. సోషల్ మీడియా […]

  • Publish Date - August 17, 2021 / 08:29 AM IST

విధాత‌: గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రభుత్వం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. హోం మంత్రి సుచరిత నిన్ననే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి, వారికి సాయాన్ని అందించి, ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థినిని ఈ విధంగా హత్య చేయడం చాలా బాధాకరం. సోషల్ మీడియా ద్వారాగానీ, ప్రత్యక్షంగా కానీ మహిళలు, యువతులపై ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే.. పోలీసులకు ఫిర్యాదు చేయండి. లేకపోతే దిశ యాప్ ద్వారా కంప్లైంట్ చేయండి. దిశ యాప్ ను ప్రతి ఒక్క మహిళ, యువతి డౌన్ లోడ్ చేసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ తెలిపారు.

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే.. ఈ ప్రభుత్వం ఏ కులమైనా, మతమైనా, ఎవర్నీ ఉపేక్షించదు. పక్క రాష్ట్రంలో ఓ మెడికోపై అఘాయిత్యం జరిగితే.. ముఖ్యమంత్రి జగన్ గారు స్పందించి, అసెంబ్లీలో దిశ బిల్లు చేసి, చట్టం కోసం కేంద్రానికి పంపించాం. అది చట్టమైతే ఇటువంటి ప్రేమోన్మాదులకు, అల్లరిమూకలకు మరింత వేగంగా శిక్షలు పడతాయి. రమ్య హత్య కేసులో.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్టు చేశారు.
పనిలేని ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు కుమారుడుగా తప్పితే.. ఏ అర్హతా లేని లోకేష్ ఈ మధ్య వెయిట్ తో పాటు విచక్షణ కూడా కోల్పోయి ముఖ్యమంత్రిగారిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. రమ్యను కోల్పోయి వారి కుటుంబం బాధలో ఉంటే.. ఓదార్చాల్సిందిపోయి, గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్ళకుండా అడ్డుకోవడం, పోలీసులపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేయడం బాధాకరం. ముఖ్యమంత్రి జగన్ గారిని వ్యక్తిగతంగా దూషించినంత మాత్రాన జీరోగా ఉన్న లోకేష్ ఎప్పటికీ హీరో కాలేడు అన్నది గుర్తుంచుకోవాలి.

ప్రజల మన్ననలు, సంపూర్ణ విశ్వాసంతో ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత రెండేళ్ళలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అప్రతిహాతంగా విజయ దుంధుభి మోగించారు. నాయకుడు అంటే జగన్ గారిలా ఆదర్శంగా ఉండాలి తప్పితే.. చిల్లర రాజకీయాలు చేయకూడదు. లోకేష్ గ్రామ స్థాయి నాయకుడి కంటే హీనంగా మాట్లాడుతున్నాడు. అమెరికాలో చదివిన లోకేష్.. ఇటువంటి భాషను మాట్లాడటం ఎంతవరకు సబబో తనకు తానే ఆత్మ విమర్శ చేసుకోవాలి. ముఖ్యమంత్రిగారిని ప్రస్తావిస్తూ.. వ్యక్తిగతంగా దూషణలు చేయడం లోకేష్ మానుకోవాలి. లోకేష్ వచ్చిన తర్వాతే.. రాజకీయాల్లో ఇటువంటి బూతుల ట్రెండ్ ను కొత్త ట్రెండ్ గా తెచ్చాడు.

యుద్ధంలో జయించిన హీరో మాదిరిగా నిన్న రమ్య కుటుంబ సభ్యుల పరామర్శకు వెళ్ళిన లోకేష్.. నుదుటున పెద్ద బొట్టుపెట్టుకుని, కారు దగ్గర పిడికిలి బిగించి చూపిస్తూ సంకేతాలు ఇస్తూ, పోలీసులపై దౌర్జన్యం చేస్తూ, నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంటి…?. పెళ్ళికి, చావుకీ ఒకే మంత్రం అన్నట్టుగా లోకేష్ చేష్టలు ఉన్నాయి. ప్రతిదాన్నీ టీడీపీ రాజకీయం చేయాలని చూడటం తగదు. దళితుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకిగానీ, లోకేష్ కు గానీ లేదు. ఎవరైనా దళితులుగా పుడతారా.. అని మాట్లాడిన చంద్రబాబు దళితుల గురించి మాట్లాడటమా.. అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

దళితులు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి ఆత్మ లాంటి వారు. ఇకనైనా టీడీపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ను మానుకుంటే మంచిది. ప్రతిదానికీ కులాన్ని ముడిపెట్టి, కుల రాజకీయాలు చేయటం మానాలి. రమ్య హత్య ఘటనలో… ప్రభుత్వంగానీ, పోలీసుల నిర్లక్ష్యంగానీ ఉంటే.. దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటన. రమ్య దారుణ హత్యను.. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన బాధ్యత సమాజంలో అందరిపైనా ఉంది.