19 వరకు.. బాబు రిమాండ్ పొడిగింపు

విధాత: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు ఈ నెల 19 వరకు పొడగిస్తు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు రెండో దఫా విధించిన రిమాండ్ గడువు గురువారంతో ముగిసింది.
దీంతో జైలు అధికారులు గురువారం చంద్రబాబును వర్చువల్ గా జడ్జి ఎదుట హాజరపరిచారు. సీఐడీ బాబు జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించాలంటూ ఎసిబి కోర్టులో మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు జ్యూడిషల్ రిమాండ్ ను రెండు వారాలపాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ శుక్రవారంకు వాయిదా పడింది. నేడు మధ్యాహ్నం ఇనుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది. బాబు బెయిల్ పిటిషన్ పై, సిఐడి కస్టడి పిటిషన్ పై గత రెండు రోజులు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే, సిఐడి తరఫున అదనపు పేజీ పొనవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
అటు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వు చేసింది. చంద్రబాబు తరుపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లుద్రా, సిద్ధార్థ అగర్వాల్ వినిపించారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది.