కేంద్రం ఇళ్లకు ఇచ్చిన నిధులు ఏం చేశారు
విధాత:26 నెలల్లో ఒక్క కొత్త ఇల్లు కట్టని వైసీపీ ప్రభుత్వం 2022 కు 30 లక్షల ఇళ్లు నిర్మిస్తాం అని చెపుతుంది.రాష్ట్రం లో నిర్మాణం పూర్తి ఐన ఇళ్ళు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పగలారా!?అని అన్నారు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి. కంట్రాక్టర్ల కు బిల్లులు ఇవ్వలేకనే పేదల ఇళ్ళ బదలాయించడం లేదు.అర్బన్ హౌసింగ్ పై అవినీతి లో ఈ ప్రభుత్వం విచారణ ఎందుకు జరపలేదు.అన్నింటిలో విచారణ అంటున్న వైసీపీ హౌసింగ్ […]

విధాత:26 నెలల్లో ఒక్క కొత్త ఇల్లు కట్టని వైసీపీ ప్రభుత్వం 2022 కు 30 లక్షల ఇళ్లు నిర్మిస్తాం అని చెపుతుంది.రాష్ట్రం లో నిర్మాణం పూర్తి ఐన ఇళ్ళు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పగలారా!?
అని అన్నారు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి.
కంట్రాక్టర్ల కు బిల్లులు ఇవ్వలేకనే పేదల ఇళ్ళ బదలాయించడం లేదు.అర్బన్ హౌసింగ్ పై అవినీతి లో ఈ ప్రభుత్వం విచారణ ఎందుకు జరపలేదు.అన్నింటిలో విచారణ అంటున్న వైసీపీ హౌసింగ్ పై ఎందుకు వెనక్కి తగ్గుతుంది?
నాటి మంత్రి నారాయణ తో నేటి వైసీపీ ప్రభుత్వం అంతా సెట్ చేసుకుందా.మంత్రి కొడాలి నాని ధాన్యానికి సంబంధించి కేంద్రం నిధులివ్వలేదు అంటున్నారు మరి ఇళ్లకు ఇచ్చిన డబ్బులు ఏం చేశారు.మంత్రులే మిల్లర్లు నడుపుతున్నారు కాబట్టి ధాన్యం డబ్బులు వేయడం లేదని అనిపిస్తుంది.తెలంగాణా మంత్రి నిరంజన్ ఎపి ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి అన్నారు ఇప్పుడు జోక్యం చేసుకొంటే మాహక్కులను హరిస్తున్నారు అంటున్నారు.తెలంగాణా మంత్రి సోమూ వీర్రాజు పై వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని ఎపి నీళ్లను దొంగల్లా వాడుకుంటూ జల దోపిడీకి పాల్పడుతున్నారని.తెలంగాణా ద్రోహం చేస్తుంటే కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోకూడదన్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి, మంత్రులు నీటి దొంగ లు ఏపి లో ఉన్న తెలంగాణా ఏజెంట్లు కెసిఆర్ కు తొత్తొలుగా మాట్లాడుతున్నారు.తెలంగాణ మంత్రులు ఎపి లో ఎపి లో ఉన్న ఎమ్మెల్యే లు తెలంగాణాలో వ్యాపారాలు చేస్తూ ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నారు.చంద్రబాబు రాయలసీమ వాసి అయి ఉండి కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటు,సిపిఎం, సిపిఐ పార్టీలకు సిగ్గులేదామోడీ జోక్యం చేసుకోవాలన్న నేతలు ఇప్పుడు జోక్యం చేసుకుంటే తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. నీతి అజెండా లేదా సిపిఎం, సిపిఐ తెలంగాణా కు వ్యతిరేకమా ఎపి కి అనుకూలమా అని ప్రజలకు చెప్పాలి.
సిపిఐ, సిపిఎం టిఆర్ ఎస్ పార్టీ తొత్తులు.జల వివాదం లో ఎపి ముఖ్యమంత్రి జగన్, తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ దాగుడు మూతలు ఇక ఆపాలి.రైతుల జీవితాలతో ఆడే ఈ కుట్ర తో అటు తెలంగాణా లో కేసిఆర్ ఇటు ఎపి లో జగన్ ద్రోహులుగా మారారు.ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రే కాదు మంత్రులంతా గిఫ్టులు తీసుకుంటున్నారు,సోమవీర్రాజు మంత్రి ఇళ్లు కట్టుకున్నారని పేరు చెప్పకపోయినా కొడాలి నాని ఎందుకు స్పందించారు,నాని స్పందించడం వెనుక అనుమానం వస్తుంది,కొడాలి నాని కి చిత్తశుద్ధి ఉంటే మంత్రే విచారణ జరిపించాలి.