విధాత: స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామ స్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్(శాప్) బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.
శాప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఆయన సోమవారం రాజమహేంద్రవరం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. విఎల్ పురంలోని మార్గాని ఎస్టేట్‌లో ఉన్న ఎంపీ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాజన్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజన్న ఆశయంతో, జగనన్న ప్రజా రంజక పాలన పాలనా స్ఫూర్తితో ‘రాజన్న రచ్చబండ’ కార్యక్రమాన్ని నిరంతరాయం నిర్వహించడాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా రాజన్న రచ్చబండ కార్యక్రమాన్ని సందర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ స్ఫోర్ట్ అథారిటీ ఛైర్మన్ హోదాలో మొదటి సారిగా జిల్లాకు రావడం జరిగిందని అన్నారు. క్రీడలు గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి సాధించాల్సి వుందన్నారు. ఆ దిశగా అభివృద్ధి చెందాలంటే స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం, సహాకారం చాలా అవసరం అని తెలిపారు. ఇతర శాఖల మాదిరిగా క్రీడా రంగం స్వయం ప్రతిపత్తి రంగం కాదని, ఇది సంక్షేమం వంటి రంగమని, అందుకే ప్రతిభను గుర్తించి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆ దిశగా ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని, గ్రామ స్థాయి నుంచి క్రీడాభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు.అద్భుతాలు సృష్టించే క్రీడాకారులు గ్రామాల్లో ఉన్నారని, క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినప్పుడే వారికి సరైన గుర్తింపు దక్కుతుందన్నారు.దేశంలో అన్ని రంగాల్లో మాదిరిగానే క్రీడల్లోనూ ప్రతిభకు లోటు లేదన్నారు. శాప్ ద్వారా క్రీడా అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి స్పోర్ట్స్ పాలసీని తీసుకురావాలని ఆదేశించారని, ఈ పాలసీ కోసం రాష్ట్రంలోని అథ్లెటిక్స్, మాజీ అథ్లెటిక్స్, పిఈటీలు, హెచ్‌ఎంలను రాజకీయ నాయకులను, మీడియాను సైతం సలహాలు ఇవ్వాలని సూచించడం జరిగిందని అన్నారు.
జిల్లా పరిషత్ స్కూళ్లు, ప్రైవేటు స్కూల్ల్స్ గ్రౌండ్‌లను సైతం శాప్ ద్వారా అభివృద్ధి చేస్తామని అన్నారు.క్రీడలను ప్రొత్సహించేందుకు ప్రత్యేక కోచ్‌లను నియమిస్తామని అన్ని వసతులతో అకాడమిలను ఏర్పాటు చేస్తామన్నారు.
అన్ని విధాలుగా స్ఫోర్ట్ అథారిటీని ముందుకు తీసుకెళ్లుతున్నామని ముఖ్యమంత్రి నవరత్నాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లే స్పోర్ట్స్‌ను కూడా అభివృద్ధి చేయాలని కోరామని తెలిపారు.సింధూ, రజనీలను ప్రొత్సహించినట్లే ప్రతిభ కల్గిన క్రీడాకారులను ప్రొత్సహించడం జరుగుతుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో క్రీడలను ప్రొత్సహిస్తామని అన్నారు.
ఖేల్ ఇండియా, కేంద్ర స్పోర్ట్స్ అథారిటీ నుంచి రాష్ట్రా క్రీడాభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ మార్గాని భరత్ రామ్‌ను కోరారు.జగనన్న ఆశిస్సులతో రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేస్తామని అన్నారు ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ భరత్ రామ్ మాట్లాడుతూ 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో ఎపి నుంచి అథ్లైటిక్స్ పాల్గొని గోల్డ్ మెడల్ సాధించేలా స్పోర్ట్స్ అధారిటీ సర్వం నేతృత్వంలో కృషి చేయాలని కోరారు.
మొట్టమొదటి సారిగా ఛైర్మన్ హోదాలో రాజమహేంద్రవరం రావడం, రాజన్న రచ్చబండను తిలకించడం పట్ల ఆయన కృతజ్ఞత తెలిపారు. యూత్ ఐకాన్ గా ఉన్న బైర్రెడ్డి సిద్ధార్ధరెడ్డి రానున్న తరాలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రాజకీయాల్లోకి కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూ యువకులే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉండేందుకు ప్రొత్సహిస్తున్నారని, అందులో భాగంగానే సిద్ధార్థరెడ్డికి ప్రోత్సహాన్ని అందిస్తున్నారని అన్నారు. రానున్న కాలంలో యువతే ఎపి రాజకీయాల రూపు రేఖలు మార్చాలని భావిస్తున్నారని అన్నారు.
సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలో ఎపి క్రీడా ఆదర్శంగా ఉండాలని అన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువకుల్లో ప్రతి మాట తూటలా మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకున్న శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి యూత్ ఐకాన్‌గా నిలిచారని క్రీడాకారులకు ప్రొత్సహాన్ని అందించి భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి, జక్కంపూడి గణేష్‌లను ఎంపీ మార్గాని భరత్ రామ్ శాలువాలతో సత్కరించారు.