ముఖ్యమంత్రి ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి..పరుచూరి అశోక్ బాబు

డీఏలు, పీఆర్సీలు అమలుచేయలేకపోతున్నందుకు,సీపీఎస్ రద్దు చేయలేనందుకు ముఖ్యమంత్రి ఉద్యోగులకు బహిరంగ క్షమాపణచెప్పి,తన తప్పు ఒప్పుకోవాలి.తానేంచేసినా ఉద్యోగులు ఏమీచేయలేరనే భ్రమల్లో ముఖ్యమంత్రి ఉంటే,అదిఆయనకే ప్రమాదం. విధాత:నరేగానిధుల విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు వేసినివిధానంచూశాక, దేశంలో ఏప్రభుత్వమూ వైసీపీప్రభు త్వంలా దిగజారి వ్యవహరించడంలేదని అర్థమైందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు.రాజకీయంగా వైసీపీనేతలు ఉద్యోగులపైచేస్తున్న జులుం, పెత్తనం కూడా మరేరాష్ట్రంలో జరగడంలేదన్న అశోక్ బాబు దర్శిలో […]

ముఖ్యమంత్రి ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి..పరుచూరి అశోక్ బాబు

డీఏలు, పీఆర్సీలు అమలుచేయలేకపోతున్నందుకు,సీపీఎస్ రద్దు చేయలేనందుకు ముఖ్యమంత్రి ఉద్యోగులకు బహిరంగ క్షమాపణచెప్పి,తన తప్పు ఒప్పుకోవాలి.తానేంచేసినా ఉద్యోగులు ఏమీచేయలేరనే భ్రమల్లో ముఖ్యమంత్రి ఉంటే,అదిఆయనకే ప్రమాదం.

విధాత:నరేగానిధుల విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు వేసినివిధానంచూశాక, దేశంలో ఏప్రభుత్వమూ వైసీపీప్రభు త్వంలా దిగజారి వ్యవహరించడంలేదని అర్థమైందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు.
రాజకీయంగా వైసీపీనేతలు ఉద్యోగులపైచేస్తున్న జులుం, పెత్తనం కూడా మరేరాష్ట్రంలో జరగడంలేదన్న అశోక్ బాబు దర్శిలో ఒక ఈఈని ఎందుకుసస్పెండ్ చేశారో ప్రభుత్వం సమాధానంచెప్పాలన్నారు.ఎమ్మెల్యే సోదరుడు తనపని ఎందుకుచేయరంటూ ఈఈని ఏకవచనంతో సంబోధిస్తే, తానే మీ మీఇంట్లో పాలేరునికానని, మర్యాదగా మాట్లాడాలని అధికారి అంటే అతనికి సస్పెన్షన్ ను ప్రభుత్వంకానుకగా ఇచ్చిందన్నారు. ఎమ్మెల్యే సోదరుడు ఎమ్మెల్యేకి చెప్పడం, ఆయన విద్యుత్ శాఖ ఎస్ఈని ఆదేశించడంతో ఈఈని సస్పెండ్ చేశారన్నారు. ఈఈ అనేహోదా రావాలంటే,ఎంతో కష్టపడాలని,కానీ ఎమ్మెల్యే పదవిపోతే,ఎమ్మెల్యేసోదరుడి నని చెప్పుకుంటున్నవ్యక్తి ఎవరోకూడాప్రజలకు తెలియదని అశోక్ బాబు ఆగ్రహంవ్యక్తంచేశారు.
ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, వారితో పనిచేయించుకునేటప్పుడు అధి కారం శాశ్వతంకాదనే వాస్తవాన్ని వైసీపీనేతలు గుర్తించి మ సులుకుంటే మంచిదని టీడీపీనేతహితవుపలికారు. కేంద్ర ప్రభుత్వఉద్యోగులకు డీఏలు విడుదలయ్యాయని, దాంతో రాష్ట్రఉద్యోగులంతా తమకు ఈప్రభుత్వం డీఏలు ఎప్పుడిస్తుందా అని ఉద్యోగసంఘాల నాయకులను ప్రశ్నిం చడం ప్రారంభించారన్నారు. కొందరు నేతలైతే ఏకంగా ఇది వరకే సన్మానాలుకూడా చేయించు కున్నారని,వారంతా ఇప్పుడుకేంద్రప్రభుత్వ ప్రకటనపై రాష్ట్రప్రభుత్వాన్ని ఏంప్రశ్ని స్తున్నారో ఉద్యోగులకు చెప్పాలన్నారు. కేంద్రప్రభుత్వం ఎప్పుడైతే మూడుడీఏలు ఇచ్చిందో, అప్పుడే రాష్ట్రప్రభుత్వం కూడా ఉద్యోగులకు డీఏలు విడుదల చేయాల్సిందన్నారు. 01-07-2018 నుంచి ఏపీప్రభుత్వం ఉద్యోగులకు డీఏలు బకాయిఉందని, ఆడీఏలతాలూకా జీవోలుకూడాఇచ్చారని,దాంతో అనేకమంది ఉద్యోగులు సీఎఫ్ఎంఎస్ కిందబిల్లులు కూడా పెట్టుకున్నారన్నారు.
2018 పోయి 2021 వచ్చినా ఇంతవరకు ప్రభుత్వంమాత్రం డీఏలు విడుదలచేయలేదన్నా రు. ప్రభుత్వం ఇచ్చినజీవోలే అమలుకాకుంటే, ఇంక వేటికి విలువ ఉంటుందని టీడీపీనేత ప్రశ్నించారు. డీఏఅనేది ఉద్యో గుల హక్కని, ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్యనఉన్న హక్కుని అమలుచేయాల్సిన బాధ్యతప్రభుత్వానిదేనని అశో క్ బాబు తేల్చిచెప్పారు. కేంద్రప్రభుత్వం విడుదలచేసిన మూ డు డీఏలు, ఏపీప్రభుత్వ మూడుడీఏలుకలిపితే, మొత్తం జగన్ సర్కారు ఉద్యోగులకు 6డీఏలు బాకీ ఉందన్నారు. దాంతోపాటు పీఆర్సీ కూడాఇవ్వాల్సిఉందన్నారు. 27శాతం ఐఆర్ ఇచ్చామని, దాంతో ఉద్యోగులకు ఆర్థికంగా ఇబ్బంది లేదని కొందరంటున్నారని, ఐఆర్ అనేది పనిచేస్తున్న ఉద్యోగులకుమాత్రమే వస్తుందని, రిటైరైన వారికి ఐఆర్ తో పనిలేదన్నారు. 01-01-2020 నుంచి కొన్నివేలమంది రిటైరయ్యారని, వారందరికీ పీఆర్సీ వస్తుందో లేదో తె లియడం లేదన్నారు. రిటైరైన ఉద్యోగులకు వర్తించే బెనిఫిట్లు కూడా ప్రభుత్వం సరిగా అమలుచేయడంలేదన్నారు. ఉద్యోగులు జీపీ ఎఫ్ అకౌంట్లలోని సొమ్ముతీసుకోవడానికి కూడా ఉద్యోగులకు వెసులుబాటులేకుండా చేశారన్నారు. 15వతేదీవచ్చినా నేటికీ చాలామంది ఉద్యోగులకు జీతాలు అందలేదన్నారు. సాక్షరభారత్ అనే కేంద్రపథకాన్నిఈప్రభు త్వం నిలిపేసిందని, దాన్నికొనసాగించి,అందులో పనిచేసే వారికి న్యాయంచేస్తామన్న జగన్మోహన్ రెడ్డి హామీఇంతవర కు అమలుకాలేదన్నారు. పీఆర్సీ, డీఏల చెల్లింపులపై ప్రభుత్వంనుంచి స్పష్టమైన సమాధానమే రావడంలేదన్నా రు. ఉద్యోగసంఘాలు నెత్తీనోరు బాదుకున్నా ఆర్థికమంత్రి మాత్రం వారికి కనిపించడంలేదన్నారు.
ప్రభుత్వం మొత్తం దేవుడులేనిగుడిలా తయారైందన్న అశోక్ బాబు, ముఖ్య మంత్రి ఎప్పుడుకనిపిస్తారో ఎవరికీ తెలియడంలేదన్నారు. సీపీఎస్ రద్దుపై ముఖ్యమంత్రి మాటతప్పాడని, వారంలో రద్దుచేస్తానన్న వ్యక్తే, గత ఏప్రియల్ లోనే సీఎం ఉద్యోగ సంఘాలనేతలకు రద్దుచేయడంకుదరదని చెప్పేశాడన్నారు. పంచాయతీ ఆఫీసులకు రంగులేయడానికి రూ.4వేలకోట్లు ఖర్చుచేసినప్రభుత్వానికి సీపీఎస్ రద్దుచేయడం సంక్లిష్టమ నితెలియదా అని అశోక్ బాబు నిలదీశారు. గతంలో చంద్ర బాబునాయుడు ఉన్నవాస్తవాన్ని ఉద్యోగులకుచెప్పారని, సీపీఎస్ రద్దుచేయడం వీలుకాదని, దానికి బదులుగా ఫ్యామిలీ పెన్షన్ వర్తింపచేస్తామనిచెప్పడం జరిగిందన్నారు. సీపీఎస్ రద్దుసంగతి అలాఉంటే, ఆర్టీసీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి కూడాచాలా దారుణంగా ఉందన్నారు. సీపీఎస్ రద్దు హామీపై మాటతప్పామని, డీఏలు, పీఆర్సీ చెల్లించలేమని ఇప్పటికైనా ఈప్రభుత్వం గౌరవంగా ఒప్పుకొనిఉద్యోగులను క్షమాపణకోరాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఉద్యోగు లుఏమీ చేయలేరులే , ఏం మాట్లాడుతారులే అనుకునే ప్ర భుత్వానికి ఎప్పుడుఏవిధంగా సమాధానంచెప్పాలో అప్పుడే చెబుతారని టీడీపీఎమ్మెల్సీ హెచ్చరించారు. రాష్ట్రం విడిపోయిందన్న ఆనందడోలికల్లో జగన్ ఉన్నప్పుడే, చంద్రబాబునాయుడు రూ.16వేలకోట్ల ఆర్థికలోటుని కూడా ఖాతరుచేయకుండా ఉద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. చంద్రబాబునాయుడు 20శాతం ఐఆర్ ఇస్తానంటే, జగన్మోహన్ రెడ్డి 27శాతం ఇస్తాననిచెప్పి, వారిని మోసగించాడన్నారు. డీఏలు, సీపీఎస్, పీఆర్సీలపై జగన్మోహన్ రెడ్డి మాటలునమ్మిన ఉద్యోగులంతా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారన్నారు. గతప్రభుత్వం 1వ తారీకునే జీతాలిస్తే, ఈప్రభుత్వం 15వతేదీ వచ్చినా ఇవ్వడం లేదన్నారు. చివరకుఉద్యోగులే తమకుతాము పీఆర్సీలు, డీఏల సంగతి దేవుడెరుగు, ఒకటిన జీతాలివ్వమని కోరే పరిస్థితి ప్రభుత్వమే కల్పించబోతుందన్నారు. ఎవరో ఒకరి ద్దరు ఉద్యోగసంఘాలనేతలను పక్కనపెట్టుకొని, మొత్తం రాష్ట్రంలోని ఉద్యోగులంతా తనపక్షానే ఉన్నారని, తానేం చేసి నా చెల్లుతుందని ముఖ్యమంత్రి భావిస్తే, అంతకంటే మూర్ఖ త్వం మరోటిఉండబోదన్నారు. ఉద్యోగుల ఇబ్బందులు ఇప్పుడు ముఖ్యమంత్రికి అర్థమవుతున్నట్లు లేవన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే సీపీఎస్ అవుతుందో, అవదో చెప్పా లని, డీఏలు, పీఆర్సీతక్షణమే అమలుచేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఉద్యోగులను మోసగించడం ప్రతి సారీ సాధ్యపడదనే వాస్తవాన్ని ముఖ్యమంత్రి ఎంతత్వరగా గ్రహిస్తే అంతమంచిదన్నారు. ఉద్యోగులు తమసమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి అందుబాటులో ఉండటం లేదని, కనీసం ఆర్థికమంత్రైనా ఉద్యోగుల వెతలు వింటే, వారు సంతోషిస్తారన్నారు. ఉద్యోగులను జగన్మోహన్ రెడ్డి మోసగిస్తున్న తీరుని టీడీపీ తీవ్రంగా తప్పుపడుతోందని, ఉ ద్యోగులపక్షాన వారికి అండగానిలవడానికి, వారుచేసే పోరా టాలకు మద్ధతివ్వడానికి ప్రధానప్రతిపక్షం ఎప్పుడూ ముం దుంటుందని అశోక్ బాబు తేల్చిచెప్పారు.
ఉద్యోగులు వేచి చూస్తున్నారు తప్ప, ఏమీచేయలేక కాదనే వాస్తవాన్ని ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఉద్యోగులకు 11శాతం డీఏ కేం ద్రప్రభుత్వమిస్తే, ఏపీప్రభుత్వం దానిపై ఆలోచించకపోతే ఎలాగన్నారు? ఉద్యోగసంఘాల నాయకుల్లో కొందరు జీరో లీడర్లున్నారని, వారిలో నిజమైన నాయకత్వ లక్షణాలుంటే, తక్షణమే ఉద్యోగులపక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. మార్చి 2019నాటికి ఉద్యోగులకు మూడు డీఏలు బకాయిలున్నాయని, ఆనాడే చంద్రబాబునాయుడు వాటిఅమలుకు సానుకూలత వ్యక్తం చేశారని, ఒక్క సీపీఎస్ రద్దే సాధ్యంకాదని ఆయన చెప్పడం జరిగిందన్నారు. సీపీఎస్ రద్దయితే వచ్చే ప్రయోజనాలన్నీ తాను అమలుచేస్తానని కూడా చంద్రబాబునాయుడు హామీ ఇవ్వడంజరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్ది వారంలోనే సీపీఎస్ రద్దుచేస్తాననిచెప్పాడని, ఇంతవరకు దానిపై స్పష్టత లేదన్నారు.కేరళప్రభుత్వం సీపీఎస్ రద్దుచేస్తామనిచెప్పి కూడా ఏమీచేయలేకపోయిందన్నారు. కేంద్రప్రభుత్వ పరిధి లోనిచట్టాలపై జోక్యంచేసుకునే అధికారం రాష్ట్రప్రభుత్వాలకు ఉండదన్నారు. గతంలో సీపీఎస్ విషయమై కొందరునేతలు తనపై దాడిచేసినంత పనిచేశారని, వారంతా ఇప్పుడెందుకు నోరెత్తడంలేదో వారేచెప్పాలన్నారు.

పరుచూరి అశోక్ బాబు
(టీడీపీ కేంద్రకార్యాలయ కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ)